10 సెకన్లలో పేలుడు పదార్థాలు గుర్తించే పరికరం..

by  |
10 సెకన్లలో పేలుడు పదార్థాలు గుర్తించే పరికరం..
X

దిశ, ఫీచర్స్ : భారత్‌లో ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్ల గురించి అందరికీ తెలుసు. విస్ఫోటనం తర్వాత వాటిల్లే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేలుళ్ల వల్ల ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టాన్ని అంచనా వేయలేం. ఈ క్రమంలో కేవలం పది సెకన్లలోనే పేలుడు పదార్థాలను గుర్తించే పరికరాన్ని ఐఐటీ బాంబే రూపొందించింది. దీని ద్వారా సాధ్యమైనంత మేర ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించొచ్చు. ఈ డివైజ్‌కు ‘నానోస్నిఫర్’ అని నామకరణం చేశారు. మైక్రోసెన్సార్ బేస్డ్ ఎక్లోప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్ అయిన నానోస్నిఫర్‌ను ఐఐటీ బాంబే సహకారంతో ‘నానోస్నిఫ్ టెక్నాలజీస్ స్టార్టప్’ తయారు చేసింది.

ఈ డివైజ్.. నైట్రోజ్లైసెరిన్, అమ్మోనియం నైట్రేట్, ఆర్‌డీఎక్స్ వంటి ప్రమాదకర పేలుడు పదార్థాలను వంద శాతం ఖచ్చితత్వంతో అతి తక్కువ సమయంలో గుర్తిస్తుంది. దీనిని మిలిటరీ, ఇతర కార్యకలాపాల కోసం వినియోగించొచ్చు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరికరంతో పోలిస్తే.. ఈ దేశీయ పరికరం ధర మూడోవంతు మాత్రమే. ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా దేశీయ టెక్నాలజీతో ఈ డివైజ్ తయారు చేయగా.. దీని రూపకల్పనలో ఐఐటీ ఢిల్లీ వెంచర్ వెహంట్ టెక్నాలజీస్ సహకారం కూడా తీసుకున్నారు. ‘ఐఐటీ ఢిల్లీ, బాంబే ఇన్‌స్టిట్యూట్స్, నానోస్నిఫ్, వెహంట్ టెక్నాలజీస్ కృషితో ఈ ప్రొడక్ట్ మేకింగ్ సాధ్యమైందని, జాతీ భద్రత కోసం ఇలాంటి దేశీయ పరికరాన్ని రూపొందించడం గర్వంగా ఉందని’ ప్రొఫెసర్ రాంగోపాల్ తెలిపారు.



Next Story

Most Viewed