కాంగ్రెస్‌కు తీవ్రవాద సంస్థల మద్దతుపై సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరవాలి: బీజేపీ ఎంపీ అభ్యర్థి

by Disha Web Desk 9 |
కాంగ్రెస్‌కు తీవ్రవాద సంస్థల మద్దతుపై సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరవాలి: బీజేపీ ఎంపీ అభ్యర్థి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్రవాదుల మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ పార్టీతోనే పోటీ అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ధర్మపురి అరవింద్ విలేకరులతో మాట్లాడుతూ.. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలలో నిషేధిత సీమి సంస్థ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ గెలిపించాలని కరపత్రాలు పంచడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒకప్పుడు సిమీ కార్యకలాపాలు జరిగాయని దాని నిషేధించిన తర్వాత ఉనికి లేకుండా పోయిందని ఇటీవల సిమీ పేరు ( పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) పిఎఫ్ఐ కార్యకలాపాలు వెలుగు చూడడంతో ఎన్ఐఏ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందేనని అన్నారు.

1973లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగడ్ యూనివర్సిటీలో సీమీ సంస్థ పురుడు పోసుకుందని దానిపై దేశంలో 17 ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, నిషేధిత కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద కేసులు నమోదయ్యాయని ధర్మపురి అరవింద్ అన్నారు. 27 మందిని సిమీ కార్యకర్తలు నాయకులకు జైలు శిక్ష పడిందని గుర్తు చేశారు. సిమీ కార్యకలాపాలను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల దానిపై నిషేధాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా తీవ్రవాద సంస్థల మద్దతు తీసుకోవడం ఆందోళన కలిగిస్తుంది అన్నారు.

నిజామాబాద్ జిల్లాలో జగిత్యాల జిల్లాలో గతంలో ఐఎస్ఐ, పీఎఫ్‌ఐ కార్యకలాపాలతో పాటు రోహింగ్యాలకు పాస్ పోర్ట్ లు అందాయని అన్నారు. దేశంలో ఎక్కడా బాంబు పేలుళ్లు జరిగిన జగిత్యాల జిల్లా పేరు వెలుగులోకి వచ్చే పరిస్థితి వచ్చింది తెలిపారు. నిషేధ సంస్థలకు ఐసిఐసిఎస్ మద్దతు ఉన్న విషయం కూడా విచారణలో వెల్లడైందని గుర్తు చేశారు. ఇటీవల గల్ఫ్ దేశాల్లోని కొన్ని మత సంస్థలు కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలపడం ఏమిటని ప్రశ్నించారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామ్ మందిరానికి బాబ్రీ తాళం వెయ్యవద్దంటే బిజెపికి 400 సీట్లు కావాలని అందుకే అడిగారని అరవింద్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఎన్ఆర్సి, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ పై కాంగ్రెస్ స్టాండర్డ్ ఏంటిదనేది ఇప్పటికీ స్పష్టం చేయడం లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాలన పగ్గాలు తీవ్రవాద సంస్థ చేతుల్లో ఉంటాయని ఆరోపణలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో 2024 లో జరుగుతున్న ఎన్నికలు హిందువుల ఉనికిని కాపాడే ఎన్నికలని దానిని గుర్తించి ఓటర్లు ఓటు వేయాలని ధర్మపురి అరవింద్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టుపెట్టవద్దని ప్రజలు ఆలోచించి విచక్షణతో బీజేపీకే ఓటు వేయాలని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్, న్యాలం రాజు స్రవంతి రెడ్డి, గద్దె భూమన్న తదితరులు పాల్గొన్నారు.

Next Story