రషీద్‌ను ఢీకొట్టినందుకే సింగిల్ తీయలేదు.. డారిల్ మిచెల్

by  |
darel
X

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్‌ సెమీఫైనల్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్ జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. కివీస్ జట్టు ఫైనల్ చేరడంలో డారిల్ మిచెల్ ఇన్నింగ్స్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా కివీస్ జట్టు ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా.. తొలి సారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్ జట్టును తన వీరోచిత ఇన్నింగ్స్‌తో డారిల్ గెలిపించాడు. కాగా, ఆదిల్ రషీద్ వేసిన 18వ ఓవర్‌లో డారిల్ కనబర్చిన క్రీడాస్పూర్తి విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.

నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న డారిల్ ఒక పరుగు పూర్తి చేశాడు. అనంతరం రెండో పరుగుకు అవకాశం ఉన్నా.. అతడు సింగిల్ తీయడానికి నిరాకరించాడు. అంతకు మునుపే ఇంగ్లాండ్ బౌలర్ ఆదిల్ రషీద్‌ను ఢీ కొట్టాననే కారణంతో అతడు పరుగు తీయడానికి ఇష్టపడలేదు. రషీద్‌ను ఢీకొట్టి.. తర్వాత పరుగు తీస్తే వివాదంగా మారుతుందనే తాను సింగిల్‌కే పరిమితం అయ్యానని డారిల్ చెప్పుకొచ్చాడు. టోర్నీ మొత్తం మేం క్రీడా స్పూర్తితోనే ఆడాము. దానినే కొనసాగించాలని తాను సింగిల్ తీయలేదని డారిల్ చెప్పుకొచ్చాడు. డారిల్ మిచెల్ దాదాపు 8 ఏళ్ల పాటు దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే అతడికి అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశం రావడం గమనార్హం.


Next Story