కరోనా రోగుల కోసం కొత్త యాప్… ఆక్సిజన్, రెమిడిసివిర్.. ఇంకా ఎన్నో..!

by  |
కరోనా రోగుల కోసం కొత్త యాప్… ఆక్సిజన్, రెమిడిసివిర్.. ఇంకా ఎన్నో..!
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తెలంగాణలో వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రతి ఆసుపత్రిలో కరోనా రోగుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను కూడా విధించింది. అయితే కరోనాతో పోరాడుతున్న వ్యక్తికి అవసరమయ్యే వివరాలతో ఓ కొత్త యాప్ ను ప్రవేశపెట్టారు. దాని పేరే “హైదరాబాద్ కొవిడ్ రిసోర్సెస్” (Hyd COVID Resources). ఈ యాప్ లో ఆక్సిజన్, అంబులెన్స్, రెమిడిసివిర్, ప్లాస్మా, బ్లడ్ బ్యాంకు, మీల్స్ సర్వీస్ లతో పాటు ఇతర సదుపాయాలను ఇందులో పొందుపరిచారు. అంతేకాకుండా ఆన్లైన్ ద్వారా మీ ఆరోగ్య సమస్యలు తీర్చడానికి డాక్టర్ల వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు గాని, మీకు తెలిసిన వారికి గాని వీటిలో ఏది అవసరమున్నా.. https://hydcovidresources.com పై ఒక్క క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన వివరాలు మీ ముందు ప్రత్యక్షమవుతాయి.



Next Story

Most Viewed