అనుమానం పెనుభూతమై… భార్య ప్రాణం తీసిన భర్త

48

దిశ, పటాన్ చెరు: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా విచక్షణరహితంగా కొట్టడంతో భార్య విగత జీవిగా మారిన విషాద సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన స్వప్న(31)పై భర్త సురేష్ కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఇదే క్రమంలో సోమవారం రాత్రి ఇంటికి వచ్చేసరికి భార్య ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో.. కోపోద్రిక్తుడైన సురేష్ భార్యను తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. గాయపడిన స్వప్నను ఇస్నాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడి నుండి పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి బంధువులు తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తమ్ముడు లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త సురేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..