దంపతులను బలిగొన్న కరెంట్..

9

దిశ, వెబ్‌డెస్క్ :  ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తోటకు వెళ్లిన దంపతులు ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జిల్లాలోని నేలకొండపల్లి మండలం బోదులబండలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన ఆనందరావు, పార్వతి భార్య భర్తలు. వీరిద్దరూ కలిసి పనిమీద చెరుకు తోటకు వెళ్లారు. రాష్ట్రంలో గత రోండ్రోజులుగా కురుస్తున్న వర్గాలకు తోడు విద్యుత్ తీగలు అక్కడక్కడా తెగిపడ్డాయి. \

ఈ నేపథ్యంలోనే దంపతులిద్దరూ కరెంట్ షాక్ తగిలి మృత్యువాత పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న వారు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మార్చురీ తరలించారు.