మత సామరస్యం..

835

మొన్న అయోధ్యలో అల్లర్లురేపి
గుజరాత్ గుండెల్లో గునపాలుగుచ్చి
గోద్రారైలు ప్రయాణికుల్ని దారుణంగా దగ్దం చేసి
నిన్న భాగ్యనగరం నడిబోడ్డులో బాంబులు పేల్చి
బుద్దుని సాక్షిగా అమాయకుల్ని

మాంసపు ముద్దలుగా మార్చి
నేడు నిత్యం మతంచిచ్చు‌ రగిలిస్తూ
కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు
రక్తపాతాలు సృష్టించే రాక్షసమూకలకిదే
నా శాంతిసందేశం……

ఎవరు ముస్లిం? ఎవరు హిందువు ?
ఎవరు క్రిస్టియన్ ? ఎవరు సిక్కు ? కాదా
ఈ నేలపై స్వేచ్చగా బ్రతకడం ప్రతివ్యక్తి జన్మహక్కు
క్రీస్తు కోరునా కిరాతకం లేదే…

రాముడు కోరునా రక్తాభిషేకం లేదే…
అల్లా కోరునా అల్లకల్లోలం లేదే…మరి జీహాదేమిటీ ?
జీహాద్ పేరుతో ఈ జీవహింస ఏమిటి ?
ఇరాన్ సిరియా ఇరాకుల్లో
నడిరోడ్లమీద ఆ నరబలి ఏమిటి ?

మతంపేర ఈ మారణహోమమేమిటి ?
నిన్నమతం …ఒక మత్తుమందు…
నేడు ఆపేరు ఎత్తితేనే రక్తం చిందు… కానీ నేడు
మనకు కావలసింది మతం కాదు…మానవత్వం
నేడు మనం ప్రతివ్యక్తిలో దర్శించవలసింది దానవత్వం కాదు… దైవత్వం… అది మతసామరస్యంతోనే సాధ్యం

 

రచన-పోలయ్య కవి కూకట్లపల్లి
హైదరాబాద్ – 9110784502
Email- [email protected]
Address: Attapur Hyderabad.48

     

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..