షాకింగ్ వీడియో.. ఎంత ధైర్యవంతులైనా భయపడాల్సిందే!

262
Huge snake

దిశ, ఫీచర్స్: పామును చూడగానే ఎవరైనా ఏం చేస్తారు? అది ఎక్కడ కాటేస్తుందోనన్న భయంతో వెంటనే ఆ ప్లేస్ నుంచి దూరంగావెళ్లే ప్రయత్నం చేస్తారు. పామును నాగదేవతగా కొలిచేవారైతే, చేతులు జోడించి మొక్కితే వెళ్లిపోతుందని అనుకుంటారు. కానీ ఎక్స్‌పర్ట్స్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. పాములు, ఇతర సరీసృపాలతో వాళ్లు ఆటలాడుకుంటారు. అయితే పాములు పట్టడంలో ఎంతటి ఎక్స్‌పర్ట్స్ అయినా జాగ్రత్తగా ఉండపోతే ప్రమాదకరమేనని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? పాము స్నేక్ హ్యాండ్లర్‌ను ఏం చేసింది? మీరే చదివి తెలుసుకోండి.

అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్‌లో ఉన్న రెప్టైల్ జూ ఫౌండర్ బ్రుయర్‌‌కు వన్యప్రాణులను డీల్ చేయడంలో ఏళ్లతరబడి ఎక్స్‌పీరియన్స్ ఉంది. గతంలో భారీ సరీసృపాలు, భయంకరమైన పాములను అవలీలగా పట్టుకున్న ఫొటోలను బ్రుయర్ తన ఇన్‌స్టా‌లో పంచుకున్నప్పుడు నెటిజన్లు ‘వావ్’ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. అయితే తాజాగా బ్రుయర్ ఓ డేంజరస్ వీడియో షేర్ చేయగా, అది చూసి నెటిజన్లు భయపడుతున్నారు. వీడియోలో జూ కీపర్‌గా ఉన్న బ్రుయర్ ఓ భారీ కొండ చిలువ పక్కనే నిలబడి చూస్తుండగా, ఒక్క సెకన్‌లో జంప్ చేసిన పైథాన్ అతడి ముఖాన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ బ్రుయర్ సెకన్ల వ్యవధిలో పక్కకు తప్పుకోవడంతో బతికిపోయాడు. కాగా ‘వే టు క్లోజ్ ఫర్ కంఫర్ట్’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశాడు బ్రుయర్. తాను తన కంటిచూపును తిప్పుకున్న క్షణకాలం(సెకను)లోనే తనపై దాడి చేసేందుకు కొండ చిలువ ట్రై చేసిందని, దీన్ని బట్టి స్నేక్ ఎంత స్మార్ట్‌గా వ్యవహరిస్తుందో మనం తెలుసుకోవచ్చని చెప్పాడు. అందుకే ఎప్పుడూ జాగ్రత్తగా, అప్రమత్తతతో వ్యవహరించడం ముఖ్యమని తెలిపాడు. కాగా ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.