ట్విట్టర్‌లో బ్లాక్ చేయకుండా ఫాలోవర్‌ను రిమూవ్ చేయడమెలా?

by  |
tWITTER1
X

దిశ, ఫీచర్స్: ట్విట్టర్ తమ వెబ్ వెర్షన్ యూజర్స్ కోసం ‘సాఫ్ట్ బ్లాక్’ అనే ఓ కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఈ ఫీచర్‌ ద్వారా ఫాలోవర్‌ను సాఫ్ట్ బ్లాక్ చేసినా లేదా రిమూవ్ చేసినా ఆ విషయం సదరు వ్యక్తికి తెలియదని ట్విట్టర్ పేర్కొంది.

ట్విట్టర్ మొబైల్ వెర్షన్‌లో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. కానీ వెబ్ వెర్షన్‌కి లాగిన్ చేసి, అక్కడ నుంచి ఫాలోవర్లను తీసివేయవచ్చు. సాఫ్ట్ బ్లాక్ ఫీచర్ పూర్తిగా బ్లాక్ చేయడం కంటే భిన్నంగా ఉంటుందని గమనించాలి. మొదటి సందర్భంలో.. ఓ వ్యక్తి ఇప్పటికీ మీ ట్వీట్‌లు, సందేశాన్ని చూడగలరు. కానీ, మీరు అనుచరుడిని తీసివేసిన తర్వాత మీ ఫీడ్‌లో వ్యక్తి మీ ట్వీట్‌లను చూడలేరు. కానీ, అదే వ్యక్తి మిమ్మల్ని మళ్లీ అనుసరించే అవకాశాన్ని పొందుతాడు. అయితే మళ్లీ ఫాలో చేయొద్దని మీరు భావిస్తే ఆ ఐడిని పర్మినెంట్‌గా బ్లాక్ చేయవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ మీకు ఇది ఎనేబుల్ కాకపోతే కొన్ని రోజుల్లో సాఫ్ట్ బ్లాక్ ఫీచర్‌ను పొందవచ్చు.

ఎలా రిమూవ్ చేయాలంటే :
* ఫాలోవర్‌ను తీసివేయడానికి, ట్విట్టర్ ప్రొఫైల్‌కి లాగిన్ అయిన తర్వాత ‘ఫాలోవర్స్’ పై క్లిక్ చేసి.. ఆపై త్రీ-డాటెడ్ చిహ్నాన్ని నొక్కాలి.
* ఇప్పుడు ‘ఈ ఫాలోవర్‌ను తీసివేయండి’ అనే ఆప్షన్ ఎంచుకోవచ్చు.


Next Story

Most Viewed