బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే మీ కోసమే

by  |
బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే మీ కోసమే
X

దిశ, వెబ్ డెస్క్: నేటి సమాజంలో ఎక్కువగా బాధించే విషయాల్లో బరువు ఒకటి. అధునిక జీవన శైలితో మనకు తెలియకుండానే బరువు పెరుగుతున్నాము. అయితే ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది పెద్ద సమస్య అయిపోయింది. బరువు తగ్గాలంటే ఖచ్చితంగా జిమ్‎కు వెళ్లి కసరత్తులే చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లోనే ఉండి కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు..

రోజులో తక్కువ ప్రమాణంలో ఎక్కువ సార్లు ఆహరం తీసుకోవాలి. ఆహారంలో ఉడకబెట్టిన కూరగాయలు, మొలకలు ఉండేలా చూసుకోవాలి. రాత్రి సమయంలో మాత్రం ఒక్క చపాతి తీసుకోవాలి. ఇక భోజనానికి ఆరగంట ముందు నీళ్లు బాగా త్రాగాలి. దీంతో ఆకలి ప్రభావం అంతగా తెలియదు. భోజనానికి రెండు గంటల తర్వాత కనీసం 30 నిమిషాలకు ఒక్కసారి నీళ్లు త్రాగాలి. అయితే ఆహారాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా తీసుకోవాలి. చిరు తిండ్లు, తీపి పదార్థాలు తినవలసి వస్తే ఒకటికి మించి తీసుకోకండి. చిన్న ప్లేట్లు ఉపయోగిస్తే మనం తక్కువ ఆహారం ప్లేట్ లో పెట్టుకున్న ఎక్కువ ఆహారం ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో తక్కువ ఆహారం తినడానికి అవకాశం ఎక్కువ ఉంది.

మీ ఫ్లాట్, ఆఫీసుల్లో, షాపింగ్ మాల్స్‎ల్లో లిఫ్టు ఎక్కకుండా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక్కరోజు, రెండు రోజులు కాదు.. అలా కొన్ని రోజులు నడిచి చూడండి. గంటల తరబడి కూర్చీలకు అతుక్కుపోకుండా గంటకోసారైనా లేచి అటు ఇటు నడవాలి. క్రమం తప్పకుండా యోగా, ఏరోబిక్ లాంటి వ్యాయామం చేయడం ద్వారా కేలరీలు తగ్గించడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన మార్గం.

Next Story

Most Viewed