కాకరకాయ పెరుగు కర్రీ చేయడం ఎలా..?

by  |
కాకరకాయ పెరుగు కర్రీ చేయడం ఎలా..?
X

కాకరాకాయ చేదుగా ఉండడంతో చాలా మంది తినడానికి ఇష్టం పడరు. కానీ పెరుగుతో కలిపి చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు కాకరకాయ పెరుగు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:
కాకరకాయలు -8, పెరుగు -కప్పు, ఆవాల నూనె – పావు కప్పు, పసుపు – 1/2 టీస్పూన్‌, కారం పొడి – 1 టీస్పూన్‌, మెంతులు – 1/2 టీస్పూన్‌, జీలకర్ర – 1 టీస్పూన్‌, ధనియాల పొడి – 1టేబుల్‌స్పూన్‌, ఉప్పు – తగినంత, ఇంగువ – చిటికెడు.

తయారీ చేసే విధానం:
ముందుగా జీలకర్ర, మెంతులను వేగించి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలపై ఉన్న పొట్టు తీసేసి ముక్కలను ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలను పిండి నీటిని తీసేస్తే చేదు పోతోంది. మరోవైపు ఒక పాత్రలో పెరుగు వేసి అందులో పసుపు, కారం పొడి, వేగించిన జీలకర్ర, మెంతులు, తగినంత ఉప్పు, ఇంగువ వేసి కలుపుకోవాలి.

స్టవ్‌పై ప్యాన్ పెట్టి నూనె వేసి కాస్త వేడయ్యాక కాకరకాయలను వేగించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో కాస్త నూనె వేసి పెరుగు మిశ్రమం వేయాలి. తర్వాత వాటిలో కాకరకాయ ముక్కలు వేసి కలుపుకొని వేగించాలి. ఉడుకుతున్న సమయంలో ధనియాల పొడి వేసి మధ్యమధ్యలో కలియబెడితే రుచికరమైన కాకరకాయ పెరుగు కర్రీ రెడీ.

Next Story