మార్కెట్‌లో ఫేక్ ఎన్95 మాస్క్‌లు

by  |
N95 Mask
X

దిశ, ఫీచర్స్ : కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతంగా వ్యాప్తిస్తూ.. జనాలను కలవరపెడుతోంది. ఆ మహమ్మారి వల్ల ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కరోనా కల్లోలం తీవ్రంగా ఉన్నా, మరోసారి లాక్‌డౌన్ చేసే పరిస్థితి లేదని ప్రభుత్వం తెగేసి చెబుతోంది. ఈ పరిస్థితుల్లో స్వీయరక్షణే శ్రీరామరక్షగా భావించి, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలి. ఇతరుల నుంచే కాకుండా, గాలి ద్వారా కూడా కరోనా వచ్చే అవకాశం ఉన్నందున మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఆ మాస్క్ మూడు లేయర్లుగా ఉండాలి లేదంటే డబుల్ మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది ఎన్95 మాస్క్‌లు వాడుతున్నారు. అయితే ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి కొందరు మార్కెట్‌లోకి ఫేక్ ‘ఎన్95’ మాస్క్‌లను తీసుకొచ్చారు. మరి వీటిని(ఫేక్ ఎన్95 మాస్క్‌లను) గుర్తించడం ఎలా?

‘గాలిలోని డ్రాప్‌లెట్స్‌‌తో పాటు 0.3 మైక్రాన్ల కన్నా పెద్ద కణాలు ప్రవేశించకుండా నిరోధించాలంటే N95 మాస్క్‌ల వాడకమే శ్రేయస్కరం. ఈ విషయంలో 95 శాతం సమర్థంగా పనిచేస్తాయి’ అని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌ భౌతిక శాస్త్రవేత్త అర్నాబ్ భట్టాచార్య వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే మార్కెట్‌లో మాత్రం ఎన్‌95 పేరుతో నకిలీ మాస్క్‌లను అమ్ముతున్నారు. ఆ మాస్క్‌లు 0.3 మైక్రాన్ కణాలను 50 – 60 శాతం మాత్రమే ఫిల్టర్ చేయగలవు. దీని అర్థం సూక్ష్మ కణాలను ఫిల్టర్ చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. అవి వైరస్‌, బ్యాక్టీరియాలను ఫిల్టర్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండవు. దీంతో ఈ మాస్క్ పెట్టుకున్నా ప్రయోజనం ఉండదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మాస్క్ తయారీదారులు చాలామంది N95 మాస్క్‌ల విషయంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రీయూజబుల్ మాస్క్‌లను కూడా N95 అని చెబుతున్నారని భట్టాచార్య పేర్కొన్నాడు. ఈ మాస్క్‌లు చిన్న కణాలను ట్రాప్ చేసే ఎలెక్ట్రోస్టాటిక్ చార్జ్‌ను ఉపయోగిస్తుండటం వల్ల అవి అంత సమర్థవంతంగా పనిచేయవు, వాటిని కడగడం వల్ల ఆ చార్జ్ పూర్తిగా తొలగిపోతుంది, వాటిని మరింత తక్కువ ప్రభావవంతం చేస్తుంది అని ఆయన అన్నాడు. ఫేక్ మాస్క్ గుర్తించే విషయంలో ఆ మాస్క్ ప్యాకింగ్‌పై ఫిల్టరింగ్ ఫేస్‌పీస్ రెస్పిరేటర్ (ఎఫ్‌ఎఫ్‌ఆర్) గుర్తులు ఉండవు. హెడ్‌బ్యాండ్‌‌పై (TC) సంఖ్య ఉండదు. NIOSH పేరు ఉండకపోవడం లేదా పేరు తప్పుగా ముద్రిస్తారు. హెడ్ ‌బ్యాండ్స్ బదులు ఇయర్ లూప్స్ ఉండొచ్చని ఆయన వెల్లడించారు.

Next Story

Most Viewed