Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు

by Disha Web Desk 8 |
Todays Horoscope : ఈరోజు రాశిఫలాలు
X

మేష రాశి : ఈరాశి వారికి నేడు ఆర్థికంగా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. చిన్న నాటి స్నేహితులను కలుసుకోవడం ద్వారా నేడు ఈ రాశికి చెందిన వారు చాలా సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభ రాశి : ఈ రాశిలోని వ్యాపారస్తులు నేడు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా అధికలాభాలు పొందుతారు. చిన్నకారు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి రుణప్రయత్నం చేస్తున్నారో వారికి నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఈ రాశి వారు భాగస్వామ్య వ్యాపారం చేసే ముందు కాస్త ఆలోచించడం మంచిది.

మిథున రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికంగా ధృఢంగా ఉంటారు. ఈరోజు మీ వైవాహిక బంధం చాలా సంతోషంగా సాగిపోతుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.

కర్కాటక రాశి : ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఈ రాశి నిరుద్యోగులకు నేడు అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా ఉద్యోగవకాశాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చాలా కాలంగా వసూలు కానీ మొండి బాకీలు వసూలవుతాయి.ఈ రాశి వారు నేడు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

సింహ రాశి : నేడు ఈ రాశివారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ సమయానికి బంధువులు, స్నేహితుల సహాయంతో ఆ సమస్య నుంచి బయటపడగలరు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి నేడు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో, వారికి నేడు కలిసి వస్తుంది.

కన్యారాశి : ఈ రాశిలో ఉన్న రాజకీయనాయకులకు నేడు కలిసి వస్తుంది. వ్యాపారస్తులు నష్టాలు చూడాల్సి వస్తుంది. ఈ రాశి వారికి నేడు వృత్తి, ఉద్యోగాల్లో కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఈ రాశి వారికి నేడు అన్నింట ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.

తుల రాశి : ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి నేడు మంచి అవకాశం దొరకుతుంది. ఈ రాశి వారు నేడు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి నేడు అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. ఈరోజు వీరు వాగ్వాదాలకు దూరంగా ఉండటం అవసరం. ఆఫీసులో ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. గత కొన్ని రోజుల నుంచి ఎరైతే తమ వర్క్ పెండింగ్‌లో పెడుతారో దాన్ని తమ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి నేడు కోర్టు ఫలితాలు అనుకూలంగా వస్తాయి. విద్యార్థులు అన్నిరంగాల్లో ముందంజలో ఉంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. వైద్యరంగంలో ఉన్నవారికి నేడు కలిసి వస్తుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు నేడు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మకర రాశి : ఈ రాశి వారు ఈరోజు మొదటి భాగంలో సమస్యలు ఎదుర్కొంటారు. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంతోను, స్నేహితులతోను సంతోషంగా ఉండే సమయం. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే, అవి పోవడంకానీ, దొంగతనంకానీ జరగవచ్చును. కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుండవచ్చు. కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందిస్తుంది.

కుంభ రాశి : ఈ రాశి వారు నేడు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం ఉత్తమం. విద్యార్థులకు కష్టకాలంగా చెప్పవచ్చు. ముఖ్యమైన పనులన్నీ నేడు పెండింగ్ పడుతాయి. దూరప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు నేడు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

మీన రాశి : కొన్నితప్పనిసరి పరిస్థితులు మీకు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. కానీ మీరు,నిగ్రహం వహించాలి. పరిస్థితిని చక్కబరచడానికి, ఆవేశంతో ముందుకి దూకవద్దు. గతంలో మదుపుచేసిన పెట్టుబడిలో, ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కానవస్తుంది. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు, మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి.

Next Story