50 ఏళ్ల తర్వాత శుక్ర, గురుల కలయిక.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు !

by Prasanna |
50 ఏళ్ల తర్వాత శుక్ర, గురుల కలయిక.. ఆ  రాశుల వారికి డబ్బే డబ్బు !
X

దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు గురు గ్రహాలు ప్రయోజనకరమైన గ్రహాలుగా పరిగణించబడతాయి. ఈ గ్రహాల సంచారం ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళినప్పుడు అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఇదిలా ఉండగా, జూన్ నెలలో వృషభరాశిలో శుక్రుడు గురు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఈ కలయిక జరగనుంది. అయితే ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఈ రాశుల వారికి శుభంగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

వృషభ రాశి

శుక్ర , బృహస్పతి కలయిక వృషభరాశి జీవితంలో ముఖ్యమైన మార్పులను తెస్తుంది. ఈ సమయంలో మీ ఆర్థిక లాభం పెరుగుతుంది. అందువల్ల, డబ్బు ఆదా చేయడం మొదలు పెడతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా వ్యాపారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మీరు పని చేసే ఆఫీసులో మీ జీతం పెరుగుతుంది. దీంతో మీ కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది.

కర్కాటక రాశి

ఈ కలయిక వలన కర్కాటక రాశి వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు వ్యాపార సమస్యలను కూడా పరిష్కరిస్తారు. అంతే కాకుండా మీరు వైవాహిక సమస్యల నుండి కొంత వరకు విముక్తి పొందుతారు. మీరు మొదలు పెట్టిన పనులను పూర్తి చేస్తారు. అంతే కాకుండా, ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఏ పని చేసిన మీ కుటుంబం నుండి మద్దతు ఉంటుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story