అవార్డులతో బాధ్యత మరింత పెరిగింది : సుచరిత

by  |
అవార్డులతో బాధ్యత మరింత పెరిగింది : సుచరిత
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ర్ట పోలీసులకు అవార్డులు రావడం సంతోషకరమని, ఇది తమపై మరింత బాధ్యతను పెంచిందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శుక్రవారం విశాఖ నగరంలోని వేలంపేట హెడ్ పోస్ట్ ఆఫీసు వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. సీఎం వైఎస్​జగన్​ పోలీసులకు స్వేచ్చ నివ్వడం వల్లే ఇన్ని అవార్డులు వచ్చినట్లు పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినట్లు మంత్రి వెల్లడించారు.

గత ప్రభుత్వం పోలీసులను ఇష్టారీతిన వాడుకున్నారని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో పోలీసులపై ఎలాంటి వత్తిడులు లేవన్నారు. అమరావతి రైతుల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ బీసీ, మైనార్టీల పక్షపాతిగా నిరూపించుకుందన్నారు. ప్రతీ రంగంలోనూ మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు హోంమంత్రి చెప్పారు. కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, వాసుపల్లి గణేష్ కుమార్, వైఎస్సార్‌ సీపీ సీనియర్ నాయకులు విళ్ళూరు రావు, కనకా రెడ్డి సనపల భరత్‌, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మావతి పాల్గొన్నారు.


Next Story

Most Viewed