నాలుగేళ్లలో మెట్రో చేసింది ఇదే.. ఎండీ వ్యాఖ్యలివే

by  |
Hyderabad Metro
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి 2017లో అందుబాటులోకి తీసుకొచ్చిన హైదరాబాద్ మెట్రో దిగ్విజయంగా కొనసాగుతోంది. పాతబస్తీ లైన్ పూర్తికానప్పటికీ గడిచిన నాలుగేళ్లలో ఎన్నో విజయాలు సాధించింది. హైదరాబాద్ మెట్రో సోమవారంతో నాలుగేళ్లు గడిచిన నేపథ్యంలో హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీ ఎస్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సాధించిన విజయాలను పంచుకున్నారు.

ఈ క్రమంలో నాలుగేళ్లలో 20.80 కోట్ల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చినట్లు ఆయన తెలిపారు. ఇలా కోట్ల మంది ప్రయాణికులు తమ సొంత వాహనాలను వినియోగించకపోవడం వల్ల 4.70 కోట్ల లీటర్ల ఇంధానాన్ని ఆదా చేయగలిగామని చెప్పారు. తద్వారా ఏడాదికి 27,500 టన్నుల కర్బన ఉద్గారతను తగ్గించగలిగామని వెల్లడించారు. అయితే కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో మెట్రో సేవలు నిలిచిపోయాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రయాణికుల తాకిడి పుంజుకుంటుందని ఇప్పటికైతే ప్రతి రోజూ దాదాపు 2.40 లక్షల మంది ప్రయాణికులు మెట్రోను ఉపయోగిస్తున్నట్లు ఎండీ తెలిపారు.


Next Story

Most Viewed