- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరేసుకుని బీజేపీ ఎంపీ మృతి..
<p>దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ, మండి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రామ్ స్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన రామ్ స్వరూప్.. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 1958, జూన్ 10న మండి జిల్లాలోని జల్పెహర్ గ్రామంలో జన్మించిన రామ్ స్వరూప్.. 2014 నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన మృతి పట్ల బీజేపీ హిమాచల్‌ప్రదేశ్ నేతలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ, మండి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రామ్ స్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన రామ్ స్వరూప్.. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 1958, జూన్ 10న మండి జిల్లాలోని జల్పెహర్ గ్రామంలో జన్మించిన రామ్ స్వరూప్.. 2014 నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన మృతి పట్ల బీజేపీ హిమాచల్‌ప్రదేశ్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. తన ఢిల్లీ నివాసంలో ఒక్కడే ఉంటున్న ఆయన కొంతకాలంగా తీవ్ర మానసిక క్షోభతో బాధపడుతున్నారు. రామ్ స్వరూప్ భార్య చార్‌థామ్ యాత్రలో ఉన్నారు. రామ్ స్వరూప్‌కు ముగ్గురు కుమారులు.
Next Story






