అలా జరగాలని హిజ్రాల పూజలు.. ప్రజలు షాక్..!

by  |
అలా జరగాలని హిజ్రాల పూజలు.. ప్రజలు షాక్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : హిజ్రాలను చూస్తేనే అంత దూరం జరుగుతాం. వాళ్లంటేనే సమాజంలో చాలా మందికి చిన్న చూపు.. చీదరింపులు.. చిత్కారాలే. కానీ వాళ్లు సమాజంలోని ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. వారిని దూరం పెట్టినా.. జనం కోసం పూజలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మేము మీకు అవసరం లేకపోయినా.. మీరు మాకు అవసరమే అంటూ ప్రజల యోగక్షేమాల కోసం జాగారాలు, పూజలు చేస్తున్నారు. ఇంతకు హిజ్రాలు ఏం చేశారంటే..

దేశాన్ని ఏడాదిగా పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేయాలని కోరుతూ తెలంగాణ హిజ్రా ట్రాన్స్ జెండర్ సమితి ఆధ్వర్యంలో జల్సా మహోత్సవ వేడుక నిర్వహించారు. అలాగే మురిగి దేవతకు పూజలు చేశారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఈ పూజ కార్యక్రమంలో హిజ్రాలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో మేరీ నాయక్ ఆధ్వర్యంలో సాక్షి, భవ్యశ్రీ లకు జల్సా మహోత్సవం నిర్వహించారు.

తెలంగాణ హిజ్రా ట్రాన్స్ జెండర్ సమితి రాష్ట్ర కోశాధికారి దోమల మేరీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని జిల్లా వ్యాప్తంగా భిక్షాటన చేసి మురిగి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా చలికాలంలో కరోనా ఎక్కువగా వ్యాపిస్తున్నందున రాత్రి మొత్తం జాగారం ఉండి గంగా దేవికి పూజలు నిర్వహించి, అన్నదానం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట హిజ్రాల సంఘం అధ్యక్షురాలు శ్రీలేఖ, హిజ్రాలు వెన్నెల, చంద్రమ్మ, గోపిక, వర్ష, మహేశ్వరి, గ్రిస్సి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed