కలెక్టర్, ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

129
Telangana High Court

దిశ,వెబ్‌డెస్క్: మంచిర్యాల కలెక్టర్ భారతి హోలీ కేరి,ఎమ్మెల్యే చిన్నయ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే, కలెక్టర్‌లతో పాటు మరో ఐదుగురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రూ.90లక్షల డీఎంఎఫ్టీ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వెంచర్‌కు రోడ్లు వేశారంటూ హై కోర్టులో బీజేపీ నేతలు పిటిషన్ వేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 22కు తెలంగాణ హై కోర్టు వాయిదా వేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..