తమిళ రాజకీయాల్లోకి హీరో విజయ్!

by  |
తమిళ రాజకీయాల్లోకి హీరో విజయ్!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకోనుంది. తమిళ్ సూపర్ స్టార్ ఇళయ తలపతి విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఆయన పార్టీ పేరును కూడా ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయించినట్లు హీరో విజయ్ స్వయంగా ప్రకటించారు. అయితే, పార్టీకి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పినట్లు సమాచారం. ఇదిలాఉండగా, విజయ్ పొలిటికల్ ఎంట్రీపై అతని బృందం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

ఈ నేపథ్యంలోనే విజయ్ పొలిటికల్ ఎంట్రీ ప్రకటనతో ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లో వణుకు పుట్టిందని చెప్పుకొవచ్చు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో హీరో రజినీ కాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ హీరో విజయ్ సొంతం. కాగా, తమిళనాడులో వచ్చే 2021-మే లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గనుక విజయ్ పోటీచేస్తే ఓట్లు చీలిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు విషయం ఎంటంటే, దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలకు తమిళనాడులో జరిగే ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దానికి కారణం అక్కడి మాజీ ముఖ్యమంత్రులు సైతం సినిమా రంగం నుంచి వచ్చిన వారే కావడం.

తమిళ రాజకీయాల్లో పొలిటికల్ పాపులారిటీ కన్నా.. సినిమా మాస్ ఫాలోయింగ్ అక్కడి ఓటర్లను చాలా ఏండ్లుగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు.. మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సినీ రంగం నుంచి వచ్చి ఆ రాష్ట్ర రాజకీయాలను మొన్నటివరకు శాసించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్, నటుడు కమల్ హసన్ సైతం 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకోసం ఇరువురు తమ పార్టీలను సైతం ప్రకటించారు. ఈ క్రమంలోనే మరో సూపర్ స్టార్ విజయ్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తే రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత పొలిటికల్ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువే అని చెప్పుకోవచ్చు.

Next Story

Most Viewed