గుండె పగిలే దృశ్యం.. పాపం ఒకేసారి ఆరు జిరాఫీలు మృతి!

by  |
గుండె పగిలే దృశ్యం.. పాపం ఒకేసారి ఆరు జిరాఫీలు మృతి!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్రికా ఖండంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి ఆఫ్రికా ఖండంలో చాలా నిరుపేద దేశాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. తినడానికి తిండి దొరక్క అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. బతుకుదెరువు కోసం ఇతర దేశాలకు వలసలు పోతుంటారు అక్కడి ప్రజలు.. అయితే, ప్రస్తుతం అక్కడ తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మనుషులకే కాదు జంతువులకు కూడా తినడానికి తిండి, తాగేందుకు మంచి నీళ్లు కూడా దొరకడం లేదు. ఫలితంగా ఒకే సారి ఆరు జిరాఫీలు మృతి చెందాయి. ఈ దృశ్యాలు హృదయవిదాకరంగా ఉన్నాయి. చనిపోయిన జిరాఫీల కళేబరాలను ఒకే చోటుకు తీసుకొచ్చి పెట్టారు. డ్రోన్ ద్వారా చిత్రీకరించిన ఈ దారుణ దృశ్యాలు అక్కడి కరువు పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

వివరాల్లోకివెళితే.. ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశాన్ని తీవ్రమైన కరువు వెంటాడుతోంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా సమ్మర్ రాకముందే అక్కడ నీటి నిల్వలు తగ్గిపోయాయి. మనుషులైతే కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక జంతువులకు అయితే తాగేందుకు నీరు లభించడం లేదు. తాజాగా వాజిర్‌లోని సబులి వైల్డ్‌లైఫ్ కన్సర్వెన్సీలో ఆరు జిరాఫీలు చనిపోయి పడి ఉండటాన్ని ఫారెస్టు అధికారులు గుర్తించారు. ఆహారం, నీరు లేకపోవడంతో ఈ జంతువులు బలహీనంగా మారాయి. అలాగే ముందుకు సాగుతూ వెళ్లి సమీపంలో ఎండిపోయిన రిజర్వాయర్‌లో నీరు తాగేందుకు ప్రయత్నించి అందులోని బురదలో కూరుకుపోయి బయటకు వచ్చేందుకు శక్తి సరిపోక అక్కడే ప్రాణాలు విడిచాయి. వీటిని గమనించిన అధికారులు రిజర్వాయర్‌లో మిగిలిన నీరు కలుషితం కాకుండా ఉండేందుకు వాటి కళేబరాలను వేరే ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు తెగ వైరల్ అవుతున్నాయి.


Next Story

Most Viewed