గుండెపోటుతో మరణాలకు ప్రధాన కారణం అదేనంట?

by Dishanational2 |
గుండెపోటుతో మరణాలకు ప్రధాన కారణం అదేనంట?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు అధికం అయ్యాయి. చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. 20 ఏళ్ల వయసు ఉన్న వారు కూడా హార్ట్ ఎటాక్‌తో మరణించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. అయితే అసలు ఇలా గుండెపోటు మరణాలు ఎందుకు ఎక్కువవుతున్నాయని,ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో జరిపిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చికిత్స చేయడంలో ఆలస్యమే గుండెపోటుకు కారణం అంట.

తీవ్ర గుండెపోటు వచ్చిన సందర్భాల్లో సరైన చికిత్సలో జాప్యమే మరణాలకు ప్రధాన కారణమని తాజా నివేదిక వెల్లడించింది. కొందరు బాధితులు మాత్రమే అత్యవసర చికిత్స కోసం సకాలంలో ఆస్పత్రులను సంప్రదిస్తున్నారని పేర్కొంది. ఆస్పత్రికి చేరుకునే జాప్యాన్ని వివిధ స్థాయిలో పరిష్కరించినట్లయితే హార్ట్ అటాక్ మరణాలను నివారించవచ్చని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో జరిపిన అధ్యయన నివేదికను ‘ది లాన్సెట్‌’ జర్నల్‌ ప్రచురించింది.



Next Story

Most Viewed