తరుచూ తేలికపాటి జ్వరంగా అనిపిస్తోందా..అయితే ప్రాణాంతక వ్యాధేనేమో?

by Disha Web Desk 8 |
తరుచూ తేలికపాటి జ్వరంగా అనిపిస్తోందా..అయితే ప్రాణాంతక వ్యాధేనేమో?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం డిఫ్తీరియా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ వ్యాధి సోకిన వ్యక్తి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం, చర్మం నీలం రంగులోకి మారడం, మెడలో వాపు, నిరంతరం తగ్గు ఉంటుంది. అంతే కాకుండా ఈ వ్యాధి సోకే మొదట్లో నిరంతరం తేలికపాటి జ్వరం వస్తుందంట. అంతే కాకుండా,గొంతు నొప్పి వేధిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఏ లక్షణం కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

ఇక ఈ డిఫ్తీరియా వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైనదని, ఇది గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించి గొంతులో ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని వైద్యులు తెలిపారు. ఇది సోకిన వ్యక్తికి మొదట్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. తర్వాత ఈ బ్యాక్టీరియా గుండె,మెదడుకు వ్యాపించి చివరకు ప్రాణం పోయే ఛాన్స్ కూడా ఉందని వారు సూచిస్తున్నారు. అందువలన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, పదే పదే జ్వరం, గొంతు నొప్పి ఉన్నట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలిని వారు చెబుతున్నారు.

Next Story