Health tips: జర భద్రం.. అక్టోబర్ నెలలో వచ్చే వ్యాధులు ఇవే!

by Dishanational2 |
Health tips: జర భద్రం.. అక్టోబర్ నెలలో వచ్చే వ్యాధులు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్ : సీజన్, మనం తీసుకునే ఫుడ్‌ని బట్టి వ్యాధులనేవి వస్తుంటాయి. అయితే అక్టోబర్ నెలలో వర్షాలు తగ్గడం మొదలవుతాయి. ఈ క్రమంలో కొన్ని రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వైరల్ జ్వరం : ఈ నెలలో ఎక్కువగా వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని లక్షణాలు అధిక జ్వరం, నాసికా రద్ధీ, గొంతు నొప్పి ఉంటుంది.

2. డెంగ్యూ : డెంగ్యూ జ్వరం వ్యాప్తి ఈ నెలలో ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యతో బాధపడుతున్న రోగుల రక్తంలో ప్లేటెలెట్లు తగ్గిపోవడమే కాకుండా అధిక జ్వరం, ఛాతీలో నొప్పి, ఆకలిలేకపోవడం, వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

3. చికెన్ గున్యా : అక్టోబర్‌లో చికెన్ గున్యా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దీనితో బాధపడే వారికి 104 డిగ్రీల జ్వరం వస్తుంది. అంతే కాకుండా జలుబు, శరీరంలో వాపు ఉంటుంది.



Next Story

Most Viewed