ఎండాకాలంలో నీళ్లు బిందెలలో వేడిగా, కుండలో చల్లగా ఉంటాయి ఎందుకని..?

by Dishanational1 |
ఎండాకాలంలో నీళ్లు బిందెలలో వేడిగా, కుండలో చల్లగా ఉంటాయి ఎందుకని..?
X

దిశ, వెబ్ డెస్క్: ఈ డౌట్ చాలామందికి వచ్చి ఉండొచ్చు. చిన్న పిల్లలైతే ఖచ్చితంగా ఈ డౌట్ ను ఇప్పటికే రేస్ జేసి ఉంటారు. అయితే, వేసవికాలం ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా నీరు ఆవిరిగా మారడం ఎక్కువవుతుంది. కుండలకు సహజంగానే సన్నని రంధ్రాలుంటాయి. అందువల్ల కుండలో నీటిని ఉంచినప్పుడు బయటి ఉష్ణోగ్రతలు అధికమైతే లోపలి నీరు కుండకున్న రంధ్రాల ద్వారా ఆవిరిగా మారి గాలిలో కలుస్తుంది. బయటి ఉష్ణోగ్రతలనే గాక కుండ లోపలి ఉష్ణోగ్రతలను కూడా తీసుకుని నీరు ఆవిరిగా మారుతుంది. ఈ కారణంగా కుండ లోపల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అందువల్ల కుండ లోపల నీరు చల్లగా ఉంటుంది.

ఇక బిందె విషయానికి వస్తే దానిని లోబాలతో తయారు చేస్తారు. అంతేకాకుండా ఎలాంటి రంధ్రాలు ఉండవు. అందువల్ల బిందె వేడిని గ్రహించి లోపల నీటి ఉష్ణోగ్రతను పెంచుతుంది. వేడెక్కిన నీరు ఆవిరిగా మారాక బయటకెళ్లేందుకు బిందెలో ఎలాంటి అవకాశం ఉండదు. ఈ కారణంగా బిందెలలో నీరు వేడిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

ఉదయాన్నే నీళ్లు తాగడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

మీ భర్త ఆరోగ్యంగా ఉండాలా.. అయితే ఈరోజుల్లో అస్సలు గాజులు ధరించకండి



Next Story

Most Viewed