ఐఫోన్లలో ChatGPT ఫీచర్ల కోసం OpenAIతో యాపిల్ డీల్!

by Harish |
ఐఫోన్లలో ChatGPT ఫీచర్ల కోసం OpenAIతో యాపిల్ డీల్!
X

దిశ, బిజినెస్ బ్యూరో: దిగ్గజ కంపెనీ యాపిల్ తన ఐఫోన్లలో ChatGPT ఫీచర్లను అందించాలని చూస్తుంది. దీని కోసం కంపెనీ OpenAIతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం చాలా కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల్లో కృత్రిమ మేధస్సు ఫీచర్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ కూడా వాటికి పోటీగా AI పై దృష్టి పెట్టింది. తదుపరి ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన యాపిల్ iOS 18లో ChatGPT ఫీచర్లను ఉపయోగించేందుకు ఒప్పందం కోసం ఇరుపక్షాలు నిబంధనలను ఖరారు చేస్తున్నాయని సంబంధిత వర్గాల సమాచారం.

ఇంతకుముందు యాపిల్ సంస్థ జెమినీ చాట్‌బాట్‌కు ఈ విధమైన లైసెన్స్ ఇవ్వడం గురించి Googleతో కూడా చర్చలు జరిపింది. కానీ ఆ చర్చలు పూర్తికాలేదు, అవి ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ వర్గాలతో యాపిల్ డీల్ కుదర్చుకోవాలని చూడటం గమనార్హం. OpenAIలో డీల్ తొందరలోనే పూర్తవుతుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. యాపిల్ జూన్‌లో నిర్వహించే వార్షిక వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది.

యాపిల్ కూడా AI ఫీచర్ల కోసం ఇతరులపై ఆధారపడకుండా తన స్వంత అంతర్గత ప్రాసెసర్‌లతో కూడిన డేటా సెంటర్‌ల ద్వారా రాబోయే కొన్ని కృత్రిమ మేధస్సు లక్షణాలను అమలు చేస్తుంది. గత ఏడాది యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ తాను వ్యక్తిగతంగా OpenAI ChatGPTని ఉపయోగిస్తానని చెప్పాడు అయితే దీనిలో అనేక సమస్యలను క్రమబద్ధీకరించవలసి ఉందని సూచించాడు. యాపిల్ ఉత్పత్తులకు కొత్త AI ఫీచర్లు వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయని ఆయన చెప్పారు.

Next Story

Most Viewed