వేసవిలో రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా?

by Dishanational2 |
వేసవిలో రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. తెల్లవారితే చాలు ఎప్పుడెప్పుడెప్పుడు టీ తాగాలా అని ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే టీ ఒత్తిడిని దూరం చేస్తుంది. అందువలన చాలా మంది టీ తాగడానికి ఆసక్తి చూపుతుంటారు.ఇక ఆఫీసుల్లో పని చేసే వారు రోజుకు మూడు, నాలుగు సార్లు టీ తాగుతూ ఉంటారు.

అయితే శీతాకాలంలో ఎక్కువ సార్లు టీ తాగినా అది ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపదు. కానీ ప్రస్తుతం వేసవి వచ్చేసింది. ఈ వేసవిలో కూడా చాలా మంది టీ తాగుతుంటారు. కానీ వేసవిలో ఎక్కువసార్లు టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదంట. అందువలన వేసవిలో చాలా తక్కువ సార్లు టీ తాగాలంట. ఎందుకంటే టీలో కెఫిన్, రిఫైన్డ్ షుగర్ రెండూ అధికంగా ఉంటాయి. అందువలన రోజు రోజుకు 5 నుండి 10 కప్పుల టీ తాగితే, అది మీ ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అవసరం.అందువల వేసవిలో రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు మాత్రమే టీ తాగాలంట. అంతే కాకుండా వేసవి అయిపోయేవరకు అసలు టీ తాగకుండా ఉండటం కూడా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Next Story

Most Viewed