మహిళలకు గుబులు పుట్టించే న్యూస్.. 2040 నాటికి 10 లక్షల బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు!

by Disha Web Desk 18 |
మహిళలకు గుబులు పుట్టించే న్యూస్.. 2040 నాటికి 10 లక్షల బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు!
X

దిశ,వెబ్‌డెస్క్: బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది వరల్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్‌గా మారనుందని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. 2015-20 మధ్య ఈ క్యాన్సర్ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువే. రొమ్ము క్యాన్సర్‌ కారణంగా 2040 నాటికి ఏటా 10 లక్షల మరణాలు సంభవించే ప్రమాదం ఉన్నదని న్యూ లాన్సెట్‌ నివేదిక వెల్లడించింది. 2020 నాటికి గత ఐదేండ్లలో దాదాపు 78 లక్షల మంది రొమ్ము క్యాన్సర్‌ బారిన పడగా..అదే ఐదు సంవత్సరాల వ్యవధిలో 6.85 లక్షల మంది మరణించారని తెలిపింది. 2020లో దాదాపు 23 లక్షలుగా ఉన్న రొమ్ము క్యాన్సర్‌ కేసులు 2040 నాటికి 30 లక్షలకు పైగా పెరుగుతాయని నివేదికలో వెల్లడించారు. అల్పాదాయ దేశాల పై ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. 2040 నాటికి క్యాన్సర్‌తో మరణించే వారి సంఖ్య ఏడాదికి దాదాపు 10 లక్షల వరకు ఉంటుందని పరిశోధకుల బృందం అంచనా వేసింది. ఢిల్లీ AIIMS అధ్యయనం ప్రకారం..మన దేశంలో 40 ఏళ్ల లోపు మహిళల్లోనే 30 శాతం రొమ్ము క్యాన్సర్ బాధితులు ఉన్నారు.

Next Story

Most Viewed