- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ నేపథ్యంలో కొత్తగా గృహ రుణాలను పొందాలనుకునేవారికి ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ప్రత్యేక ఆఫర్‌ను వెల్లడించింది. పరిమిత కాలానికి గృహ రుణాలను తగ్గిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఇంటి రుణాలపై వడ్డీ రేట్లను 6.70 శాతానికి తగ్గిస్తున్నామని, ఈ నెల 20 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్ ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ ఓ ప్రకటనలో తెలిపింది. వేతనం, ఉద్యోగం, రుణ మొత్తంతో సంబంధం లేకుండా అందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.
దేశీయంగా వినియోగదారులకు పండుగ సీజన్ కోసం పరిమిత కాలానికి ఈ ఆఫర్‌ను తీసుకొచ్చాం. రుణ మొత్తం, ఉద్యోగ కేటగిరీతో పనిలేకుండా అన్ని రుణాల దరఖాస్తులకు ఈ తగ్గింపు ఇవ్వనున్నాం. అయితే, రుణం కావాలనుకునే వారి క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండటం తప్పనిసరి అని సంస్థ పేర్కొంది. ‘దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆస్తి ధరలు స్థిరంగా ఉన్నాయి. సొంత ఇంటికయ్యే ఖర్చు గతం కంటే సరసమైన ధరలోనే లభిస్తున్నాయి. ప్రజల ఆదాయం కూడా మెరుగ్గా ఉంది. ఈ క్రమంలోనే సొంత ఇంటి కోసం ప్రయత్నిస్తున్నవారికి తక్కువ వడ్డీ రేట్లతో రాయితీలు, ప్రయోజనాలు ఇవ్వాలని నిర్ణయించామని’ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రేణు సుద్ కర్నాడ్ చెప్పారు.