ఆవు పేడ తింటే సాధారణ ప్రసవం అంట.. వైరల్ వీడియో

by  |
ఆవు పేడ తింటే సాధారణ ప్రసవం అంట.. వైరల్ వీడియో
X

దిశ, ఫీచర్స్ : హిందువులకు ఆవు అత్యంత పవిత్రమైన ఆరాధ్య దైవం. ఆవు పాదాల్లో పితృదేవతలు, అడుగుల్లో ఆకాశ గంగ, వక్షోజాలల్లో చతుర్వేదాలు, పాలలో పంచామృతాలు, కడుపులో కైలాసం, కొమ్ముల మూలంలో బ్రహ్మ, విష్ణువు.. ఇలా గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే గోమాతకు ప్రదక్షిణం చేస్తే దేవతలందరికీ ప్రదక్షిణం చేసినంత పుణ్యం, ఫలితం కలుగుతుందని నమ్ముతారు. సకల దోష నివారణకు ఆవు మూత్రాన్ని ఇంటా బయట చల్లు తారు. అంతేకాదు ఆవు మూత్రం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని, ఆవు పాలలో ఎన్నో సుగుణాలున్నాయని వైద్యులు కూడా వెల్లడించారు. ఆవును హత్తుకోవడం ద్వారా సకల రోగాలు పోతాయని పాశ్చాత్య దేశీయులు కూడా నమ్మడంతో ‘కౌ కడ్లింగ్’ పలు దేశాల్లో పాపులర్‌గా మారింది. ఇక ఆవు మూత్రం, పేడ ఔషధ ప్రయోజనాల గురించి మంత్రులతో సహా ఎంతోమంది వ్యక్తులు సోషల్ మీడియాలో వెల్లడించగా.. హర్యానాలోని ఒక వైద్యుడు ఆవు పేడను తిని, గోమూత్రాన్ని సిప్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

హర్యానా, కర్నాల్‌కు చెందిన డాక్టర్ మనోజ్ మిట్టల్ ఆవు పేడను తింటున్న వీడియో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన అందుకుంటోంది. ఆ వీడియోలో ఆవు నుంచి లభించే ‘పంచగవ్య’ ప్రాశస్త్యాన్ని వివరించే క్రమంలో కొద్ది మొత్తంలో ఆవు పేడను స్వీకరించాడు. దీన్ని తినడం ద్వారా తన తల్లి ఉపవాసం విరమించేదని చెప్పాడు. జంతువులను చేతులతో తడమడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు చేకూరుతాయని.. సాధారణ ప్రసవం కోసం మహిళలు ఆవు పేడ తినాలని కూడా సూచించాడు. అంతేకాదు దీన్ని తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని.. ఆత్మను, శరీరాన్ని శుభ్రపరిచే సామర్థ్యం గో పేడకు మాత్రమే ఉందని చెప్పుకొచ్చాడు. ఇక గోమూత్రం రక్తపోటు సమస్యలను దూరం చేస్తుందని వివరించాడు. అయితే ఈ వీడియోపై కొందరు వ్యంగ్యంగా స్పందిస్తే, మరికొందరు ఒక వైద్యుడు ఇలాంటి వాటిని ఎలా నమ్ముతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎంబీబీఎస్, ఎండీ పీడియాట్రిక్స్ అయి ఉండి.. ఏం ఆలోచిస్తున్నావ్? ఆవుపేడను మా ఇంట్లో వివిధ పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. కానీ తినడమేంటీ?’, ‘ఇది ఆమోదయోగ్యం కాదు, ఇది పిచ్చితనం.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed