హెల్త్​ప్రొఫైల్‌పై హరీశ్ రావు కీలక ప్రకటన

by  |
Hareesh Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందుబాటులోకి తీసుకురానున్న హెల్త్​ప్రొఫైల్​ కార్యక్రమం డిసెంబరు మొదటి వారంలో ప్రారంభం కానుంది. తొలి విడత సిరిసిల్లా, ములుగు జిల్లాల్లో షురూ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాకో నోడల్​ఆఫీసర్​చొప్పున నియమించారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 65 రకాల ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్​రావు బీఆర్​కే భవన్‌లో సోమవారం ప్రత్యేకంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హెల్త్ ప్రొఫైల్‌ను పక్కాగా రూపొందించాలన్నారు. సిరిసిల్ల, ములుగు ‌జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. టెస్టులను వేగంగా నిర్ధారించేందకు తెలంగాణ డయాగ్నస్టిక్స్​ సేవలను వాడుకోవాలన్నారు. దీని ద్వారా ప్రతీ రోజు సుమారు పది వేల శాంపిల్స్‌ను సులువుగా నిర్ధారించవచ్చన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి అందరి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీయాలన్నారు. ప్రతీ వ్యక్తి ఆరోగ్య సమాచారం, ఆధార్ నెంబర్, డెమోగ్రాఫిక్ వివరాలు, షుగర్, బీపీ, ఇతర వ్యాధుల డేటాను రికార్డులలో పొందుపరచాలన్నారు. దీంతో హైరిస్క్​బాధితులను సులువుగా గుర్తించి, సకాలంలో మెరుగైన వైద్యం అందించవచ్చన్నారు.

టెస్టులు నిర్వహించిన తర్వాత రిపోర్టుల వివరాలు కూడా ఆన్​లైన్​ విధానంలో పంపించాలన్నారు. ఆ వివరాలనూ భద్రపరచాలన్నారు. అత్యవసర కేసులు, యాక్సిడెంట్‌లు గురైన వ్యక్తులు ఆసుపత్రులకు వెళ్తే హెల్త్ ప్రొఫైల్​వివరాలను పరిశీలిస్తూ వైద్యం అందించాలన్నారు. దీంతో పాటు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఏ వ్యాధులు వస్తున్నాయనే విషయాలను గుర్తించాలన్నారు. తద్వారా వైద్య నిపుణుల ద్వారా సరైన సలహాలు, సూచనలు సేకరించవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ, హెల్త్​ డైరెక్టర్​ జి.శ్రీనివాసరావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ రమేష్ రెడ్డి, ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్ ఇలాఖాలో నేలరాలుతున్న నిరుద్యోగులు..

Next Story

Most Viewed