- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లుడా.. మజాకా !
<p> -ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, అప్పులు తప్పవని ఉద్ఘాటన దిశ, న్యూస్ బ్యూరో : ‘అప్పులేని వాడే పెద్ద ధనవంతుడని’ తెలంగాణలో ప్రముఖ నానుడి. మన ముఖ్యమంత్రికి, ఆర్థిక మంత్రికి అదెందుకంత సరిపడలేదో.. లేక అందులో అర్థం లేదనుకున్నారో గానీ.. తమ బడ్జెట్ ప్రసంగాల్లో కొత్త భాష్యం చెప్పుకుంటూ వెళ్తున్నారు. గత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేసీఆర్ అప్పులు చేయనోడెవడు.. అంబానీకి కూడా అప్పులు ఉంటాయని తన […]</p>

-ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, అప్పులు తప్పవని ఉద్ఘాటన
దిశ, న్యూస్ బ్యూరో :
‘అప్పులేని వాడే పెద్ద ధనవంతుడని’ తెలంగాణలో ప్రముఖ నానుడి. మన ముఖ్యమంత్రికి, ఆర్థిక మంత్రికి అదెందుకంత సరిపడలేదో.. లేక అందులో అర్థం లేదనుకున్నారో గానీ.. తమ బడ్జెట్ ప్రసంగాల్లో కొత్త భాష్యం చెప్పుకుంటూ వెళ్తున్నారు. గత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేసీఆర్ అప్పులు చేయనోడెవడు.. అంబానీకి కూడా అప్పులు ఉంటాయని తన మాటలతో విమర్శకుల నోళ్లు మూయించారు. తాజాగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తుందంటూనే.. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, అప్పులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భూములు అమ్ముకుని ప్రగతి అనుకోవడం మన రాష్ట్ర ఆర్థికమంత్రికే చెల్లుతుందని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.
ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజుల వ్యవధిలోనే అసెంబ్లీ సమావేశాలు రావడంతో గతంలో కేసీఆరే బడ్జెట్ ప్రసంగం పూర్తి చేశారు. మొదటిసారిగా ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్ రావు ఆదివారం తన తొలి బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. కాగా ఇద్దరూ తమ శైలిని ఒకే విధంగా ప్రదర్శించడం విశేషం. దేశ తలసరి ఆదాయం రూ. 1,35,050 కాగా, మన రాష్ట్ర తలసరి రూ. 2,28,216 ఉందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. మన రాష్ట్రం ప్రగతి పథంలో ఉందని చెప్పేందుకు ఇదే స్పష్టమైన సంకేతమని ఆయన వివరించారు. గణంకాల వివరాలెలా ఉన్నా.. దేశంతో పోల్చుకున్నపుడు మన రాష్ట్రం అభివృద్ధి పథంలోనే ఉందని స్వయంగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అయితే ఆరేండ్లలో ప్రగతి పథం తప్ప వెనకడుగు తెలియని రాష్ట్రంలో అప్పులు ఎందుకు చేస్తున్నారని అడిగితే మాత్రం ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. అప్పులు తేవడం ఒక భాగమైతే… తెలంగాణలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్న ల్యాండ్ బ్యాంక్‌ను అమ్మేందుకు సిద్ధమవుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు.
ప్రస్తుతం భూముల రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలంగాణ సమాజానికంతటికీ తెలుసు. ప్రభుత్వ ఆధీనంలోని భూములను అమ్మడం ద్వారా రూ.30 కోట్లను సేకరిస్తామని హరీశ్ రావు ప్రకటించారు. ఇందుకోసం గృహ నిర్మాణ సంస్థ వంటి అవకాశాలను పరిశీలిస్తున్నామని కూడా సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే ఆ విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారనే విమర్శలూ ఉన్నాయి. దీని పరిధిలో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. వీటితో పాటు టీఎస్ఎఐఐసీ ఆధ్వర్యంలో సుమారు లక్షకు పైగా ఎకరాల భూములను గుర్తించారు. దేశంలోనే ఆరో పెద్ద బడ్జెట్ కలిగిన తెలంగాణలో ప్రభుత్వం వద్ద కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్ ఉందన్నది బహిరంగ రహస్యం. వీటి అమ్మకాలకు అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరాటపడుతోందన్నది సుస్పష్టం. గతంలో కేసీఆర్ కూడా భూముల అమ్మకం ద్వారా రూ. 10 వేల కోట్లు సేకరిస్తామంటే.. ఈ సారి అల్లుడు దీన్ని రూ.30 వేల కోట్లకు పెంచడం గమనార్హం.
tags: kcr, harish rao, telangana, budget, assembly






