'హరీశ్ రావు ఓకే అన్నారు'

by  |
హరీశ్ రావు ఓకే అన్నారు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు తాజాగా ఇచ్చే వేతనాలు పూర్తి స్థాయిలో ఇవ్వాలని ఉద్యోగుల ఐక్య వేదిక చైర్మన్, తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమార స్వామి ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం మంగళవారం మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో కలసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంపత్ కుమార స్వామి మాట్లాడుతూ.. కరోనా ప్రభావంతో గత కొన్ని నెలలుగా ఉద్యోగుల వేతనాలలో కోతలు విధిస్తుండడంతో వారు తీవ్ర ఆర్ధక పరమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అంతేకాకుండా బకాయిలకు సంబంధించి జీపీఎఫ్ లో జమ చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు విడతల వారీగా ఇవ్వడానికి మంత్రి అంగీకరించారని సంపత్ కుమార స్వామి పేర్కొన్నారు. అదేవిధంగా వేతన బకాయిలను జీపీఎఫ్ లో కాకుండా నగదు రూపంలో ఇవ్వాలని మంత్రిగారిని ఐక్యవేదిక పక్షాన కోరినట్లు వెల్లడించారు.



Next Story

Most Viewed