వికీపీడియాకు ఈలన్ మస్క్ బర్త్‌డే విష్

by  |
వికీపీడియాకు ఈలన్ మస్క్ బర్త్‌డే విష్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్‌లో దేని గురించైనా సమాచారం వెతకాలంటే అందరూ మొదటగా చూసేది వికీపీడియానే. ఆ సమాచార గని పుట్టి శనివారం నాటికి 20 ఏళ్లు అయింది. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్న ఎంతోమంది ప్రముఖులు ఒకప్పుడూ, ఇప్పుడూ సమాచారం కోసం వికీపీడియా మీద ఆధారపడుతున్నవాళ్లే. అందుకే వికీపీడియా చేసిన సహాయాన్ని గుర్తుచేసుకుంటూ స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఈలన్ మస్క్, ఆ వెబ్‌సైట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే వికీపీడియా.. నువ్వు ఉన్నందుకు సంతోషం’ అని ఆయన ట్వీట్ చేశారు. కేవలం మస్క్‌కు మాత్రమే కాదు.. సొంతంగా ఎదిగిన ఎంతో మందికి వికీపీడియాలోని సమాచారం ఎంతో జ్ఞానాన్ని అందించింది. ఇప్పటికీ అందిస్తూనే ఉంది.

2001లో జిమ్మీ వేల్స్, లారీ సాంగర్‌ కలిసి వికీపీడియాను ప్రారంభించారు. ఇంటర్నెట్‌లో ఇదొక పాపులర్ వెబ్‌సైట్. ఎలాంటి ప్రకటనలు ఉండని ఈ వెబ్‌సైట్‌లో విభిన్న రకాలకు సంబంధించి మిలియన్ల కొద్దీ ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌లో ఎవరైనా ఏదైనా టాపిక్ మీద ఆర్టికల్ రాయొచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్న ఆర్టికల్‌లను ఎడిట్ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది వలంటీర్లు ఇందులో సమాచారాన్ని పొందుపరుస్తుంటారు. స్వచ్ఛంద సంస్థ వికీమీడియా ఫౌండేషన్ ఈ వెబ్‌సైట్‌ను నడుపుతోంది.



Next Story