- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఏపీలో మాదిరి మాకు రూ.24 వేలు ఇవ్వాలి
by Shyam |
X
దిశ, భువనగిరి: చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని చేనేతలు డిమాడ్ చేశారు. సోమవారం భువనగిరి పట్టణంలోని పద్మశాలి సంఘం కార్యాలయం ముందు చేనేతలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు చిక్క వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా కార్మికులకు ప్రతి ఏడాది రూ.24 వేలు ఇవ్వాలని, బతుకమ్మ చీరెల పంపిణీకి చేనేత వస్త్రాలనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు చుంచు నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ సత్తయ్య, జిల్లా కోశాధికారి బింగి భిక్షపతి, చేనేత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు కస్తూరి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story