రూ. 830 కోట్ల పన్నులు ఎగ్గొట్టిన పాన్‌మసాలా సంస్థ!

by  |
రూ. 830 కోట్ల పన్నులు ఎగ్గొట్టిన పాన్‌మసాలా సంస్థ!
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్న వ్యాపారం..భారీ మోసం మరోసారి బయటపడింది. అక్రమ మార్గంలో పాన్ మసాలాలను తయారు చేస్తూ, ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టిన ఓ సంస్థను జీఎస్టీ అధికారులు పట్టుకున్నారు. కేంద్ర వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..ఢిల్లీలోని అక్రమంగా పాన్ మసాలాలను తయారు చేస్తున్న ఓ సంస్థ ఏకంగా రూ. 830 కోట్ల పన్నులను ఎగ్గొట్టిందని వెల్లడించారు.

అధికారిక అనుమతులు లేకుండా, రిజిస్ట్రేషన్ కూడా లేని సంస్థ గుట్కా, పాన్, పొగాకు లాంటి ఉత్పత్తులను తయారు చేస్తూ దేశంలోని పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు అధికారులు కనుగొన్నారు. అధికారులు జరిపిన సోదాల్లో ముడి సరుకుతో పాటు, యంత్రాలు, తయారు చేసిన ఉత్పత్తులు లభించాయని, వాటి విలువ రూ. 4 కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్వహిస్తున్న ఈ సంస్థలో 65 మంది పనిచేస్తున్నారు. అధికారులు లెక్కగట్టిన దాని ప్రకారం..పన్నుల ఎగవేత ద్వారా ఈ సంస్థ మొత్తం రూ. 831.72 కోట్లను మోసం చేసింది.

Next Story

Most Viewed