మొక్కజొన్న జోరు.. పెరుగుతున్న వరి.. 9 లక్షల ఎకరాలకు చేరిన యాసంగి సాగు..

by  |
మొక్కజొన్న జోరు.. పెరుగుతున్న వరి.. 9 లక్షల ఎకరాలకు చేరిన యాసంగి సాగు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి సాగులో వేగం పెరుగుతోంది. రైతులు విత్తనాలు వేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్దంటున్న వరిసాగు నెమ్మదిగా పెరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఎక్కువగా సాగవుతున్న.. అధికారులు మాత్రం తక్కువగా చూపిస్తున్నారనే ఆరోపణలు సైతం విన్పిస్తున్నాయి. బుధవారం నాటి నివేదికల ప్రకారం రాష్ట్రంలో మొక్కజొన్న సాగును పెంచుతున్నారు. మొక్కజొన్నతో పాటుగా మినుములు కూడా వేస్తున్నారు.

బుధవారం నాటికి 1,15,278 ఎకరాల్లో మొక్కజొన్న వేయగా.. గతేడాది ఇదే సమయానికి 52 ఎకరాల్లోనే సాగైంది. ఇక వరి సాగు 13,180 ఎకరాలకు చేరింది. గత ఏడాది ఈ సమయానికి వరిని 37,333 ఎకరాల్లో సాగు చేయగా.. ఈసారి సంక్లిష్ట పరిస్థితుల్లో నార్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వరిసాగు ఇప్పటికే 30 వేల ఎకరాలు దాటినట్లు రైతులు చెబుతున్నారు. కానీ అధికారిక లెక్కల్లో మాత్రం 13 వేలుగా చూపిస్తున్నారు.

దీనితో పాటుగా వేరుశనగ 2.81 లక్షల ఎకరాలు, శనగ 2.93 లక్షల ఎకరాలు, మినుములు 57 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తంగా 8,93,378 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. దీనిలో మినుములు 57,817 ఎకరాల్లో వేశారు. మినుముల సాగు ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్టుగానే మినుముల సాగు కొంత మేరకు పెరుగుతుంది. గత ఏడాది ఇదే సమయానికి మినుములు 21 వేల ఎకరాల్లో వేస్తే.. ఈసారి మాత్రం 57 వేల ఎకరాలు దాటింది.



Next Story

Most Viewed