ఇది మెరుగైన రికవరీ కాదు -దువ్వూరి సుబ్బారావు 

by  |
ఇది మెరుగైన రికవరీ కాదు -దువ్వూరి సుబ్బారావు 
X

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 సంక్షోభం తాకిన సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ సమస్యాత్మక స్థితిలో ఉందని, అయితే కొన్ని సానుకూలతలు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. ఆర్థిక పునరుజ్జీవనంలో కనిపిస్తున్న సానుకూలతలు కేవలం యాంత్రికంగా పుంజుకోవడం మాత్రమేనని, దీన్ని ప్రభుత్వం పూర్తిస్థాయి పునరుజ్జీవనంగా భావించకూడదని అన్నారు.

భారత స్వల్ప, మధ్యకాలిక వృద్ధి అవకాశాల గురించి మాట్లాడిన సుబ్బారావు.. లాక్‌డౌన్ ప్రభావంతో దిగజారిన ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకునే అంశాలను కేంద్రం పరిగణలోకి తీసుకోకూడదన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ వల్ల పడిపోయిన కార్యకలాపాలు పుంజుకోవడం మెకానికల్ రీబౌండ్ మాత్రమే, దీన్ని మెరుగైన రికవరీగా భావించకూడదని సూచించారు. సంక్షోభం కొనసాగుతున్న సమయంలో ఉన్న సమస్యలు తక్కువ వ్యవధిలో చాలా పెద్దగా మారే అవకాశాలున్నాయి అన్నారు.

ద్రవ్యలోటు చాలా ఎక్కువగా ఉంది. రుణ భారం అధికంగా ఉంది. అలాగే, ఆర్థిక రంగం అధ్వాన్న స్థితిలో ఉందని సుబ్బారావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సవాళ్లను ఏ మేరకు సమర్థవంతంగా పరిష్కరిస్తారో అనే దానిపై ఆధారపడి వృద్ధి అవకాశాలుంటాయని సుబ్బారావు వివరించారు. ఈ పరిస్థితుల్లో సానుకూలతలపై స్పందించిన ఆయన.. అనేక కారణాలతో పట్టణ ఆర్థిక వ్యవస్థ కంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తక్కువ సమయంలో కోలుకుందని, మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దీనికి దోహదపడిందని తెలిపారు.

వాస్తవానికి ప్రభుత్వ వ్యయం స్వల్పకాలిక వృద్ధిపైనే ఉంది. ఇతర వృద్ధి మార్గాలైన ప్రైవేట్ వినియోగం, పెట్టుబడి, నికర ఎగుమతుల్లో నిరూత్సాహంగా ఉన్నాయన్నారు. అంతేకాకుండా, క్షీణతను తగ్గించేందుకు ప్రభుత్వ ఇప్పుడు ఖర్చు చేయకపోతే, బ్యాడ్ లోన్ల వంటి అనేక సమస్యలు తప్పవని, ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ నష్టమని దువ్వూరి సుబ్బారావు వివరించారు. ఏదేమైనా, ప్రభుత్వ రుణాలు పరిమితిలో ఉండాలని చెప్పారు.

Next Story

Most Viewed