కార్గో సేవలతో ఆర్టీసీకి కాసుల వర్షం..

by  |
కార్గో సేవలతో ఆర్టీసీకి కాసుల వర్షం..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసు విభాగానికి భారీ మద్దతు లభిస్తోంది. కరోనా నేపథ్యంలో చాలా మేర వస్తువుల సరఫరాకు కార్గో పార్శిల్ సర్వీసులపై ప్రజలు ఆధారపడుతున్నారు. ప్రైవేటు పార్శిల్ సంస్థలతో పోలిస్తే చార్జీలు తక్కువగా ఉండటంతో పాటు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విభాగం కావడంతో ప్రజలు నమ్మకం ఏర్పరచుకోవడం కూడా ఓ కారణం కావొచ్చు.

ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీకి కాసుల వర్షం కురుస్తోంది. కార్గో, పార్శిల్, కొరియర్ సేవల ద్వారా టీఎస్ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. తాజాగా కార్గో సేవల ద్వారా రూ.1,57,74,598 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడైంది. ఇదంతా జూన్ 19 నుంచి ఇప్పటివరకు ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ఆదాయంలో కార్గో ద్వారా రూ.25,31,944లక్షలు, కొరియర్ సేవల ద్వారా 1,32,42,654 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే, ఇకముందు కూడా ఈ కార్గో సేవల ఆదాయం పెంపునకు కృషి చేయాలని అధికారులకు ఈడీ ఆదేశాలు జారీ చేశారు.


Next Story

Most Viewed