పొలాల్లో గ్రాఫిక్ డిజైన్

by  |
పొలాల్లో గ్రాఫిక్ డిజైన్
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’అన్నారు నాటి భారత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్. మార్పుకు నాంది యువతే అని ఆయన భావన. చిన్నప్పటి నుంచే జీవిత లక్ష్యాన్ని ఎంచుకుంటే గమ్యం చేరడం సులువని ఆయన నిరూపించారు. అదే కోవకు చెందిన వ్యక్తి కందుల క్రాంతికుమార్. కృషి, పట్టుదల ఉంటే కష్టాలను సైతం ఇష్టంగా దున్నెయ్య వచ్చని సాటి చెబుతున్నాడీ ఆధునిక రైతు.

కందుల క్రాంతికుమార్‌ది సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం, తిమ్మాపురం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం భూమ్ లో ఎంసీఏ వరకు చదివిన ఆయన ఉద్యోగం వేటలో మహానగరానికి చేరుకున్నాడు. అక్కడ ఓ ప్రముఖ కంపెనీలో గ్రాఫిక్ డిజైనర్‌‌గా కొలువులో చేరాడు. నాలుగంఖ్యల వేతనం. ఉద్యోగం చేస్తున్నా.. ఏదో వెలితి. రోజూ ఆఫీస్‌కు వెళ్లడం.. రావడం.. అంతా రొటీన్ అనిపించింది. ఇది కాదు జీవితం అనిపించింది. ఇంకా ఏదో చేయాలనిపించింది. వెంటనే గ్రాఫిక్ డిజైనర్‌‌ ఉద్యోగానికి రిజైన్ చేసి ఇంటిబాట పట్టాడు.

వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం క్రాంతికుమార్‌‌ది. ఆయన తల్లిదండ్రులు కందుల పెద్ద తిరుమలరావు- అనితాదేవి జడ్పీటీసీ, సర్పంచ్‌గా సేవలందించారు. వారికి 25 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. క్రాంతికుమార్‌కు కూడా చిన్నతనం నుంచి వ్యవసాయంపై మక్కువ ఎక్కువే. అగ్రికల్చర్ పై ప్రేమతోనే ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఇక సాగుబడే జీవన ఒడి అని కంప్యూటర్‌ని వదిలి కర్షకుడిగా మారాడు.

తనకున్న 25 ఎకరాల్లో అప్పటి వరకు మూస పద్ధతిలోనే సాగు జరిగేది. క్రాంతి కుమార్ పొలంలో అడుగు పెట్టాక సాగుబాటను కొత్త పుంతలు తొక్కించాడు. తనకున్న సాఫ్ట్‌వేర్ టెక్నాలజీని వ్యవసాయంలో ప్రయోగించాడు. కూలీల కొరత తీర్చేందేకు ఆధునిక యంత్రాలను గ్రామాలకు పరిచయం చేశాడు. తక్కువ నీటిని ఉపయోగించి వరిసాగు చేట్టారు. నేల స్వభావాన్ని బట్టి పంటల సాగు చేపడుతున్నాడు. వ్యవసాయ అధికారుల సూచనలతో శ్రీవరి, కాలబాటల వరిసాగు చేసి విజయం సాధించాడు. అలాగే వరి నాట్లు వేసేందుకు కూలీల కొరత ఏర్పడడంతో నాటేసే యంత్రాలను కొనుగోలు చేశాడు. అలాగే కలుపు , వరాలు(గట్లు) తీసే యంత్రాలతోపాటు వ్యవసాయంలో ప్రతీ పనిని యంత్రీకరణతో చేస్తూ అబ్బుర పరుస్తున్నాడు. నేల స్టామీనను బట్టి సేంద్రియ ఎరువులతోపాటు కొంత మేర రసాయనిక ఎరువులను వాడుతూ అధిక దిగుబడులను సాధిస్తున్నాడు. కాంక్రీట్ జంగిల్ లో నాలుగు గోడల మధ్య చేసే లక్షల వేతనం వచ్చే ఉద్యోగం కన్న పచ్చని పొలాల్లో ప్రకృతితో చెలిమి చేస్తూ వ్యవసాయం చేయడం ఆనందాన్ని ఇస్తుందని క్రాంతి కుమార్ చెబుతున్నాడు. ఉద్యోగం కన్న తనకు వ్యవసాయమే సంతృప్తిని ఇచ్చిందని, ఆదాయం కూడా దీనిలోనే ఎక్కువగా ఉన్నదని కాంతినిండిన కళ్లతో క్రాంతికుమార్ వివరిస్తున్నారు. వ్యవసాయం దండగా అనుకునే ఈ రోజుల్లో క్రాంతికుమార్ ఎంచుకున్న దారి నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమే. హ్యాట్సాఫ్ కర్షకుడా..!



Next Story

Most Viewed