డ్రై రన్ ఏర్పాట్లు సంతృప్తికరం: గవర్నర్ తమిళసై

by  |
డ్రై రన్ ఏర్పాట్లు సంతృప్తికరం: గవర్నర్ తమిళసై
X

దిశ, ముషీరాబాద్: తెలంగాణ ప్రభుత్వం డ్రై రన్ కోసం చేపట్టిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. నల్లకుంటలోని తిలక్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్ సీ)లో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళసై, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితర అధికారులు శనివారం పరిశీలించారు. త్వరలో అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్ ప్రజలకు ఏ రకంగా ఇవ్వాలి, ఇబ్బందులు తలెత్తితే తీసుకోవాల్సన జాగ్రత్తలు, సిబ్బంది పనితీరు, ఏర్పాట్లు ఎలా ఉండాలన్న అంశాలపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేందుకు తీసుకున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై మాట్లాడుతూ… వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మందిని గుర్తించి జాబితా రూపొందించారని తెలిపారు. నాలుగు విడతలుగా వ్యాక్సిన్ అందజేస్తారని అన్నారు. మొదటి విడతలో భాగంగా 5లక్షల మందికి వేయనున్నట్లు తెలిపారు. ఇది సురక్షితమైన వ్యాక్సిన్ అని వివరించారు. దీన్ని హెల్త్ కేర్ వర్కర్స్‌కు ముందుగా ఇస్తారన్నారు. ఇదొక బృహత్తరమైన కార్యక్రమమని, దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు భాగా పనిచేస్తున్నాయని తెలిపారు.



Next Story

Most Viewed