ఈనెల 7 నుంచి ప్రభుత్వ ఉద్యోగుల సమరశంఖారావం..

by srinivas |
ఈనెల 7 నుంచి ప్రభుత్వ ఉద్యోగుల సమరశంఖారావం..
X

దిశ, ఏపీ బ్యూరో: ఈనెల 7 నుంచి ఉద్యోగులు ఉద్యమ బాట పట్టనున్నట్లు ఏపీ జేఏసీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు విద్యా సాగర్ వెల్లడించారు. ఈ పోరుబాటకు సంబంధించి.. ఉద్యోగుల సమస్యలపై కరపత్రాలు ఆవిష్కరించారు. విజయవాడలో సోమవారం ఉద్యోగుల సమస్యలు సహా ఆందోళనపై కార్యాచరణ వివరిస్తూ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ.. 13లక్షల ఉద్యోగులను సమాయత్త పరిచేందుకు కార్యక్రమాలను చేపట్టామన్నారు.

2018 జూలై నుంచి పీఆర్సీ అమలు చేయలేదన్నారు. ఇప్పటి వరకు పీఆర్సీ రిపోర్టు బయటపెట్టలేదని..7 పెండింగ్ డీఏలను ప్రభుత్వం నిలిపివేసిందని చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు డీఏ బకాయిలు ఇవ్వని ఏకైక సర్కార్ ఏపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదని విమర్శించారు. అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుని ఆందోళనను కొనసాగిస్తామని విద్యాసాగర్‌ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed