Alert : ఈ యాప్స్ అధికంగా వాడుతున్నారా..? వెంటనే తీసేయండి..

by  |
Google Play Store
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశం టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్న తరుణంలో నేటి యువతరం వెంటనే కొత్త వాటిని అడాప్ట్ చేసుకుంటున్నారు. అది మొబైల్స్‌లో కావొచ్చు.. యాప్స్, జెనరేషన్ విషయంలోనైనా ఒకరిని చూసి మరొకరు అప్డేట్ అవుతున్నారు. అయితే, కొత్తగా రూపుదిద్దుకుంటున్న టెక్నాలజీ పని సమయాన్ని తగ్గించడంతో పాటు కొత్త చిక్కులను తీసుకొస్తుంది. వినియోగదారుల భద్రత కోసం టెక్ కంపెనీలు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా.. హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని 9 యాప్స్ సాయంతో హ్యాకర్లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిస్తున్నట్లు డాక్టర్ వెబ్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థకు మాల్వేర్ అనలిస్ట్ విభాగం గుర్తించింది. 9 ఫోటో ఎడిటింగ్ యాప్స్ ద్వారా ఫేస్‌బుక్ యూజర్స్ లాగిన్, పాస్‌వర్డ్‌లను సేకరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ప్లే స్టోర్ నుంచి ఈ యాప్స్‌ను గూగుల్ తొలిగించినట్లు సమాచారం. ప్రత్యేకమైన టెక్నాలజీ సాయంతో హ్యాకర్స్ యాప్స్‌లోకి ఎంటర్ అయి సెట్టింగ్స్ మార్పులు చేస్తున్నట్లు డాక్టర్ వెబ్ సంస్థ వెల్లడించింది.

ఆ తర్వాత Webview.next పేరుతో జావాస్క్రిప్ట్ సాయంతో FB పేజీలో మార్పులు చేసి.. యూజర్స్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను తమ సర్వర్లలో భద్రపరుస్తున్నట్లు తేలింది. యూజర్స్ తమ పేజీలోకి ప్రవేశించాక కుకీస్‌తో పాటు ఇతర డేటా వివరాలు సేకరించి సైబర్ నేరగాళ్లకు అందజేస్తున్నట్లు డాక్టర్ వెబ్ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ 9 యాప్‌లకు 10 లక్షల నుంచి 50లక్షల డౌన్‌‌లోడ్స్ ఉన్నట్లు పేర్కొంది. అందువల్లే యూజర్స్ ఎవరైనా ఈ యాప్స్‌ గురించి తెలియక ఇన్‌స్టాల్ చేసుకుంటే వెంటనే తీసివేయాలని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్లే స్టేర్ నుంచి డిలీట్ అయిన యాప్స్ :

1.ప్రాసెసింగ్ ఫోటో (Processing photo)
2.పీఐపీ ఫోటో (Pip photo)
3.రబ్బీష్ క్లీనర్ (Rubbish cleaner)
4. హోరోస్కోప్ డైలీ ( Horoscope daily)
5.యాప్ లాక్ ‌కీప్ (App loc keep)
6.ఇన్‌వెల్ ఫిట్‌‌నెస్ (Inwell fitness)
7.లాకిట్ మాస్టర్ (Lock it master)
8. యాప్ లాక్ మేనేజర్ (App lock manager)
9. హోరోస్కోప్ పై (Horoscope pi)


Next Story

Most Viewed