- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూగుల్ మ్యాప్స్‌లో టోల్ ధరలు.. ఎప్పటి నుంచంటే ?
దిశ, ఫీచర్స్: ఒకప్పుడు తెలియని ప్రదేశానికి వెళ్లాలంటే.. ప్రతీ సిగ్నల్ వద్ద అడ్రస్ అడుగుతూ గమ్యస్థానానికి చేరుకునేవాళ్లం. గూగుల్ మ్యాప్ ఆ బాధలన్నీ తీర్చేసింది. ఇప్పుడు మ్యాప్ ఆన్ చేసుకుని ఎక్కడికైనా హ్యాపీగా వెళ్లిపోవచ్చు. అలాగే సుదూర ప్రాంతాలకు ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు పెట్రోల్, డీజిల్ ఖర్చును లెక్కల్లోకి తీసుకుంటాం కానీ టోల్ చార్జీలు ఎంత అవుతాయో తెలియక టెన్షన్ పడిపోతుంటాం. ఇకపై ఆ సమస్యకు కూడా గూగుల్ మ్యాప్ పరిష్కారం తీసుకురానుంది. త్వరలోనే మీ రోడ్ ట్రిప్‌లో వచ్చే టోల్ ఫీజు ఎస్టిమేషన్స్‌తో పాటు ఇతర ధరలను ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.
ఆండ్రాయిడ్ పోలీసుల నివేదిక ప్రకారం.. టోల్ అంచనాలను తెలిపే ఫీచర్ రాబోతుండగా, ఇది వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతోంది. వినియోగదారులు టోల్ రోడ్లను కాకుండా ఇతర ప్రత్నామ్నాయ మార్గాలను ఎంచుకుంటారా? లేదా అదే రహదారిపై జర్నీని కొనసాగించాలా? అని నిర్ణయించుకోవడానికి గూగుల్ మ్యాప్స్ అందించే సమాచారం ఉపయోగపడనుంది. ఇక ఈ ఫీచర్ యూజర్లందరికి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ప్రస్తుతానికైతే తెలియదు. అంతేకాదు ఎంచుకున్న ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతుందా? లేదా అన్ని దేశాలలో అందుబాటులో ఉంటుందా? అనేది విషయంలోనూ స్పష్టత లేదు.
గూగుల్ మ్యాప్స్‌లో టోల్స్‌ను నివారించి డబ్బు ఆదా చేయడం ఎలా?
* మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్‌ను తెరిచి, గమ్యాన్ని సెర్చ్ బార్‌లో టైప్ చేయండి
* యాప్.. ‘డైరెక్షన్స్’ బటన్‌ను చూపించిన తర్వాత, దాన్ని క్లిక్ చేయండి.
* ఇప్పుడు స్క్రీన్‌పై గల ‘యువర్ లొకేషన్’ పక్కనున్న త్రీడాట్స్ బటన్‌ను ట్యాప్ చేసి, ఆ తర్వాత ‘రూట్ ఆప్షన్స్’పై మళ్లీ క్లిక్ చేయాలి.
*గూగుల్ మ్యాప్స్ మెనూను చూపుతుంది. అప్పుడు ‘అవాయిడ్ టోల్’ బాక్స్‌పై టిక్ చేయాలి. మీరు మెనూ నుంచి హైవేలు, ఫెర్రీలను నివారించడానికి కూడా ఎంచుకోవచ్చు.
* మీ ఎంపిక పూర్తయిన తర్వాత ‘కంప్లీటెడ్’పై నొక్కండి. ఆ తర్వాత స్క్రీన్ దిగువన ఎడమ మూలలో కనిపించే ‘స్టార్ట్’ బటన్‌పై నొక్కండి.