గూగుల్ మ్యాప్స్‌లో డార్క్ మోడ్

by  |
గూగుల్ మ్యాప్స్‌లో డార్క్ మోడ్
X

దిశ, ఫీచర్స్ : ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు మొబైల్స్‌‌తో సహజీవనం చేస్తున్నాం. ఇక ప్రతీ అవసరానికి మొబైల్ యాప్స్ ఉపయోగించడం సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను అతిగా చూడటం వల్ల కళ్లు త్వరగా అలిసిపోవడమే కాకుండా కంటిచూపు కూడా దెబ్బతింటోంది. దీనికి పరిష్కారంగానే పలు యాప్స్ ‘డార్క్ మోడ్ ఫీచ‌ర్‌’ను తీసుకొస్తూ క‌ళ్లకు శ్రమ త‌గ్గిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, వాట్సాప్, జీమెయిల్, యూట్యూబ్‌తో పాటు గూగుల్ సెర్చ్ యాప్స్ ఈ తరహా డార్క్ మోడ్ ఫెసిలిటీని కల్పిస్తుండగా, తాజాగా గూగుల్ మ్యాప్స్‌కు కూడా డార్క్ మోడ్ ఫీచ‌ర్‌ను విడుదల చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.

గూగుల్.. గత సంవత్సరం సెప్టెంబరు నుంచి మ్యాప్స్ కోసం డార్క్ మోడ్‌ను పరీక్షిస్తుండగా, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలిపింది. కాగా యాప్‌ సెట్టింగ్స్‌లోని థీమ్‌ ఆప్షన్‌లో ‘ఆల్‌వేస్ ఇన్ డార్క్’ మోడ్‌ను సెలెక్ట్ చేసుకుంటే.. మ్యాప్స్‌ను డార్క్ మోడ్‌లో చూడొచ్చు.

ఒకవేళ డార్క్ మోడ్ నచ్చకపోతే, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకునే అవకాశం కూడా ఉంది. అయితే డార్క్ మోడ్ వ‌ల్ల క‌ళ్లపై ఒత్తిడి త‌గ్గడంతోపాటు బ్యాట‌రీ కూడా సేవ్ అవుతుంది. ఈ కొత్త అప్‌డేట్‌లో మ్యాప్స్ నేపథ్యం కోసం గ్రే షేడ్ ఉపయోగిస్తుండగా, స్ట్రీట్ నేమ్స్ కూడా ‘గ్రే షేడ్’ రంగులోనే హైలైట్ చేశారు. డార్క్ మోడ్‌తో పాటు ‘వైడ్ రోల్ ఆఫ్ షెడ్యూలింగ్ ఇన్ మెసేజెస్, న్యూ వెర్షన్ ఆఫ్ టాక్ బ్యాక్, పాస్‌వర్డ్ చెకప్ ఫీచర్, అప్‌డేట్స్ టు అసిస్టెంట్’ వంటి మరికొన్ని ఫీచర్లను ఆండ్రాయిడ్ కోసం ప్రకటించింది గూగుల్.


Next Story

Most Viewed