వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్

by  |
వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: వైద్య విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. తెలంగాణలో వైద్య విద్యార్థుల స్టైఫండ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు, సూపర్ స్పెషాలిటీ విద్యార్థుల స్టైఫండ్ పెంచుతున్నట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ హౌస్ సర్జన్లు, పీజీ, డిగ్రీ, పీజీ డిప్లమో, ఎండీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదువుతున్న విద్యార్థి వైద్యులకు 2021 జనవరి 1 నుంచి స్టైఫండ్ 15 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ పెంపుతో మెడికల్ డెంటల్ హౌస్ సర్జన్లకు నెలకు రూ.22,527 అందనుండగా.. పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో, ఎండీఎస్ తొలి సంవత్సరం విద్యార్థులకు నెలకు రూ.50,686, రెండో సంవత్సరంలో రూ.53,503, మూడో ఏడాది రూ.56,319 అందనున్నాయి.

సూపర్ స్పెషాలిటీ తొలి ఏడాది విద్యార్థులకు రూ.56,319, రెండో ఏడాది వారికి రూ.59,135, మూడో ఏడాది రూ.61,949 రానున్నాయి.



Next Story

Most Viewed