ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్… ఆ పోస్టులకు ప్రిలిమ్స్ రద్దు !

by  |
ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్… ఆ పోస్టులకు ప్రిలిమ్స్ రద్దు !
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. గ్రూప్‌ -2, గ్రూపు 3 సహా ఇతర క్యాడర్‌ పోస్టుల భర్తీ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని భావిస్తోంది. ఇకపై ఒకే పరీక్ష నిర్వహించనుంది. మెరిట్ అభ్యర్థుల ద్వారా మాత్రమే ఆయా పోస్టులను భర్తీ చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. గ్రూప్‌ -1తోపాటు అన్ని కేటగిరీల పోస్టుల భర్తీకి ప్రస్తుతం ప్రిలిమ్స్‌/స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహిస్తోంది. వీటిలో అర్హత సాధించిన వారికి మెయిన్స్‌ పరీక్షను నిర్వహిస్తున్నారు. అయితే ఇకపై గ్రూప్‌ – 2, గ్రూప్‌ – 3 సహా ఇతర క్యాడర్‌ పోస్టులకు ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ఒక పరీక్షనే నిర్వహించి మెరిట్‌ అభ్యర్థులను సంబంధిత పోస్టులకు ఎంపిక చేయనుంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రిలిమ్, స్క్రీనింగ్ టెస్టుల కారణంగా అభ్యర్ధులపై మానసిక ఒత్తిడి పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రిలిమ్స్/ స్క్రీనింగ్ కేవలం గ్రూప్-1కే పరిమితం చేయనున్నారు. మిగిలిన ఉద్యోగ నియామకాలను పరీక్ష విధానం ద్వారానే చేయాలన్న ప్రతిపాదనలను ఏపీపీఎస్సీ రెడీ చేస్తున్నట్టు సమాచారం.

Next Story

Most Viewed