2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

52

దిశ, ఏపీ బ్యూరో: 2008 డీఎస్సీ అభ్యర్ధులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 2,193 మంది అభ్యర్ధులను మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌తో ఎస్జీటీలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. అమరావతిలో శుక్రవారం టెట్‌-2021 సిలబస్‌ను విడుదల చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 13ఏళ్ల పోరాటానికి సీఎం జగన్ న్యాయం చేశారన్నారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

2018 డీఎస్సీ అభ్యర్ధులకు కూడా న్యాయం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 486 పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్‌ పీఈటీలకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్ధులను అసలు పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్ధులను కూడా చంద్రబాబు మోసం చేశారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..