బంగారంలా మెరుస్తున్న చెట్టు: అవి ఆకులా? బంగారు రేకులా?

by  |
బంగారంలా మెరుస్తున్న చెట్టు: అవి ఆకులా? బంగారు రేకులా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకృతి ఎప్పుడూ మనుషులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఎన్నో అద్భుతాలను కళ్ళముందుకు తీసుకొస్తూ ఉంటుంది. ప్రకృతిలోని ప్రతిదీ ఒక అద్భుతం.. అందులో అద్భుతమైన చెట్లు మొదటి స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఒక చెట్టు ఋతువులను బట్టి ఒక్కోలా ఉంటుంది. శరత్కాలంలో ఆకులు రాలిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. కొన్ని కొన్ని ఆకులు పసుపు కలర్ లోకి మారిపోయి రాలిపోతూ ఉంటాయి. అలా రాలిపోతూ మోడుబారుతూ ఉంటాయి. కానీ చైనాలోని ఒక చెట్టు మాత్రం ఎన్ని ఆకులు రాలిన మోడుబారదు. ఆ చెట్టే జింగో బిలోబా. శరత్కాలంలో ఆ చెట్టును బంగారు చెట్టు అని పిలుస్తారు. ఎందుకో తెలుసా ఆ చెట్టంతా బంగారు వర్ణంలోకి మారిపోతుంది.

ఒక్కోసారి ఆ చెట్టును చూసి మన కళ్ళను మనమే నమ్మలేమంటే..నమ్మండి. అవి ఆకులా? లేక బంగారు రేకులా? అని అనుమానం రాకుండా పోదు. అందుకే ఆ చెట్టు అంత ఫేమస్. ఇక ఈ చెట్టును చూడాలంటే ముందు నుండే రిజర్వేషన్ చేయించుకోవాలి. శరత్కాలంలో బంగారు వర్ణంలోకి మారిపోయే ఈ చెట్టును చూడడానికి ప్రతియేటా ఎంతోమంది పర్యాటకులు చైనా కు క్యూ కడతారంట. ఇక ఈ వృక్షం 1400 సంవత్సరాల క్రితం నాటిదని అక్కడ ప్రజలు చెప్తున్నారు. అన్ని కాలాలలోనూ ఆకుపచ్చగా ఉండే ఈ చెట్టు.. శరత్కాలంలో మాత్రం మొత్తం బంగారు రంగులోకి మారిపోతుంది. అక్కడి ప్రదేశంలో రాలిన ఆకులను, చెట్టు ను చూస్తే మరో ప్రపంచానికి వెళ్ళామా అనిపించక మానదు. అందుకే ఈ చెట్టును చూడడానికి పర్యాటకులు బారులు తీరుతున్నారు.


Next Story

Most Viewed