ఏంటి..బంగారం!

by  |
ఏంటి..బంగారం!
X

బంగారం మళ్లీ పరుగులు పెడుతోంది. కరోనా ప్రభావం కారణంగా మార్చి త్రైమాసికంలో అంచనా వేసిన ఆదాయాన్ని సాధించలేమని యాపిల్ సంస్థ ప్రకటించింది. దీంతో పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా చైనాతో సహా పలు దేశాలు భారీ స్థాయిలో ఉద్దీపనలు ప్రకటిస్తాయనే అంచనాలకు తోడు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కీలకమైన వడ్డీరేట్లను తగ్గిస్తాయనే అంచనాలు కూడా బంగారం పెరగడానికి దోహదం చేశాయి. తాజాగా ఈక్విటీ మార్కెట్లు క్షీణించడం కూడా మరో కారణమని, మరో ఆసక్తికర అంశమేంటంటే.. డాలర్ మారకం నాలుగు నెలల గరిష్టంలో ట్రేడవుతున్నప్పటికీ బంగారం పెరుగుతుండటం గమనార్హమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో పసిడికి భారీగా డిమాండ్ పెరిగింది. బుధవారం ఢిల్లీలో ఏకంగా రూ. 462 వరకూ పెరిగి పది గ్రాముల బంగారం రూ. 42,339కి చేరుకుంది. వెండి సైతం పసిడి బాటలోనే పయనిస్తూ రూ. 1,047 పెరిగింది. దీంతో కిలో వెండి రూ. 48,652 కు చేరుకుంది.

Next Story